మండే ఎండలకు బార్లీ మందు!

ఎండలు మండి పోతున్నాయి. ఈ వేడి నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు, తక్షణ శక్తిని ఇచ్చేందుకూ ఎంచుకోవలసిన ఆహారం బార్లీ. అది ఎందుకో తెలుసుకోండిలా...

Published : 29 Apr 2023 00:21 IST

ఎండలు మండి పోతున్నాయి. ఈ వేడి నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు, తక్షణ శక్తిని ఇచ్చేందుకూ ఎంచుకోవలసిన ఆహారం బార్లీ. అది ఎందుకో తెలుసుకోండిలా...

* రోజూ గ్లాసు బార్లీ నీళ్లను తాగితే చాలు డీహైడ్రేషన్‌ సమస్య అదుపులోకి వస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది. ఖనిజలవణాలన్నీ చెమట రూపంలో బయటకి పోయినప్పుడు... కాస్త తేనె, చిటికెడు ఉప్పు కలుపుకొని తాగితే చాలు శరీరం పునరుత్తేజితమవుతుంది.

* బార్లీ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. వీటిల్లో అధికంగా ఉండే ఫైబర్‌ పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తిని పెంచి పెద్ద పేగు క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఆహారం. కాళ్లలో వాపులతో బాధపడేవారు బార్లీ నీళ్లను తాగితే పరిష్కారం లభిస్తుంది. 

* రక్తహీనతతో బాధపడే వారు బార్లీ జావ రోజూ తాగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచడంలో ఇది సమర్థంగా పని చేస్తుంది. ఈ గింజల్లో ఇనుము, కాపర్‌ దండిగా ఉంటాయి. రక్తహీనతను అధిగమించేలా చేస్తాయి.

* వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్‌ సి ఎక్కువ. అవి పోషకాహార లోపాల్ని అధిగమించి రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడేలా సాయపడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని