రక్తస్రావం అదుపులో ఉండేలా..

సాధారణంగా పీరియడ్స్‌ 28 రోజులకే అవుతుంది. ఇది మహిళలందరిలో ఒకేలా ఉండదు. శరీర తీరును బట్టి మార్పులుంటాయి. హార్మోన్ల ప్రభావం వల్ల కొంతమందిలో అధిక రక్తస్రావం, ఒళ్లునొప్పులు అధికంగా ఉంటాయి.

Published : 30 Apr 2023 00:22 IST

సాధారణంగా పీరియడ్స్‌ 28 రోజులకే అవుతుంది. ఇది మహిళలందరిలో ఒకేలా ఉండదు. శరీర తీరును బట్టి మార్పులుంటాయి. హార్మోన్ల ప్రభావం వల్ల కొంతమందిలో అధిక రక్తస్రావం, ఒళ్లునొప్పులు అధికంగా ఉంటాయి. వీటిని సహజంగా అదుపులో పెట్టొచ్చంటున్నారు నిపుణులు..

* నొప్పులను తగ్గించేందుకు హాట్‌ప్యాక్‌లను వినియోగిస్తూంటాం. హాట్‌ప్యాక్‌ను పొత్తి కడుపుపై 20 నిమిషాల పాటు జరుపుతూ మర్దనా చెయ్యాలి. బ్లీడింగ్‌ ఎక్కువగా అవుతుంటే రోజులో ఇలా 2, 3 సార్లు చేస్తే తగ్గుతుంది.

* శరీరంలో ఐరన్‌ తగ్గితే కూడా అధిక రక్తస్రావం అవుతుందని అధ్యయనాల్లో తేలింది. నెలసరిలో వైద్యుల సలహాతో ఐరన్‌ మాత్రలను తీసుకోవచ్చు. దాంతో కొంత వరకూ బ్లీడింగ్‌ను అదుపులో ఉంచొచ్చు.

* ఓ కప్పు నీళల్లో ఓ అంగుళం ముక్క దాల్చిన చెక్కను వేసి కాచుకొని తాగాలి. ఒళ్లునొప్పులను అదుపులో ఉంచడమే కాక బ్లీడింగ్‌ని కూడా తగ్గిస్తుంది. ఆ సమయంలో వచ్చే ఇన్ఫెక్షన్లనూ నిరోధిస్తుంది.

* విటమిన్‌ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. అవి రోగనిరోధక శక్తిని పెంచుతూ, ఇనుముకు గ్రాహకాలుగా పని చేస్తాయి. తగినన్ని నీళ్లు తాగాలి. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ, విశ్రాంతి తీసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని