మల్లెపూల టీ ఆరోగ్యానికి మేటి!

తేయాకునీ, మల్లెపూలను ప్రత్యేక పద్ధతుల్లో డీహైడ్రేట్‌ చేసి ఈ టీని తయారు చేస్తారు. ఈ పరిమళాలు మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తాయి.

Published : 01 May 2023 00:18 IST

* తేయాకునీ, మల్లెపూలను ప్రత్యేక పద్ధతుల్లో డీహైడ్రేట్‌ చేసి ఈ టీని తయారు చేస్తారు. ఈ పరిమళాలు మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తాయి. అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతాయి. అయితే, దీన్ని వేడివేడిగా కాకుండా చల్లటి నీటిలో కలిపి తాగితేనే మేలట.

* జాస్మిన్‌ టీలో శక్తిమంతమైన పాలీఫినాల్స్‌ ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ వల్ల కణాలు దెబ్బ తినకుండా కాపాడతాయి. కొన్నిరకాల క్యాన్సర్లు, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.

* మల్లెటీ వల్ల కెలొరీలూ ఎక్కువగా కరుగుతాయి. ఇందులోని ఔషధ గుణాలు మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి.

* యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఇది జ్వరాన్ని తగ్గించి వ్యాధినిరోధక శక్తినీ పెంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని