ఐస్‌క్రీమ్‌ ఇస్తున్నారా?

వేడిని భరించలేక చల్లచల్లగా ఏదో ఒకటి తాగేయాలనిపిస్తుంది. ఈ పరిస్థితి మనదే కాదు.. పిల్లలది కూడా! వాళ్లకేమో మనసు ఐస్‌క్రీమ్‌ మీదకి మళ్లుతుంటుంది.

Published : 04 May 2023 00:13 IST

వేడిని భరించలేక చల్లచల్లగా ఏదో ఒకటి తాగేయాలనిపిస్తుంది. ఈ పరిస్థితి మనదే కాదు.. పిల్లలది కూడా! వాళ్లకేమో మనసు ఐస్‌క్రీమ్‌ మీదకి మళ్లుతుంటుంది. రోజూ కావాలని మారాం చేస్తుంటారు. కానీ వారానికి ఒక స్కూప్‌ లేదా 50 మి.లీ. మాత్రమే ఇవ్వాలంటున్నారు పోషకాహార నిపుణులు. దానిలో ఉండే కొవ్వులు, చక్కెరలు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తాయట. కాబట్టి..

* అరటిపండును గుజ్జు చేసి, ఫ్రీజ్‌ చేయండి. తర్వాత దాన్ని మెదిపి, స్ట్రాబెర్రీ, నట్స్‌ ముక్కలు, కొద్దిగా తేనె కలిపి ఇస్తే సరి. చల్లగా తినేస్తారు.. పోషకాలూ అందుతాయి.

* పాలను కాగబెట్టి, చల్లార్చి దానికి నానబెట్టిన ఖర్జూరాలు, నచ్చిన పండ్లు కలిపి మిక్సీ పట్టి ఫ్రిజ్‌లో ఉంచేయండి. చల్లచల్లని మిల్క్‌షేక్‌ రెడీ. స్ట్రాబెర్రీ, అరటి, పుచ్చకాయ, ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. డార్క్‌ చాక్లెట్‌ని కరిగించి, ఈ ముక్కలను దానిలో ముంచి ఒక ట్రేలో పెట్టి, ఫ్రిజ్‌లో ఉంచితే సరి. డార్క్‌ చాక్లెట్‌లో చక్కెర తక్కువ. కొద్దిమొత్తంలో తీసుకుంటే మెదడూ చురుగ్గా ఉంటుంది. ఇక పండ్లతో పోషకాలెన్నో.

* పెరుగుని బాగా గిలకొట్టి.. దానిలో నచ్చిన పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కోసి వేయాలి. ఐస్‌క్రీమ్‌ కోన్లలో ఈ మిశ్రమాన్ని పోసి డీప్‌లో పెడితే సరి. పెరుగు చలవ చేయడమే కాదు.. జీర్ణవ్యవస్థ సక్రమంగా జరిగేలా చూస్తుంది. వద్దు అని పిల్లలను ఆపడం కష్టమే. కాబట్టి.. ఇలా ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటే ఆరోగ్యం.. వాళ్లకీ ఆనందం. ఏమంటారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని