భుజాల బరువును తగ్గిద్దాం..

మనం ఏ పని చేయాలన్నా భుజాలు బలంగా ఉండాలి. బలహీనంగా ఉంటే వంటగదిలో చిన్న చిన్న బరువులు ఎత్తేందుకు కూడా సహకరించవు.  ఆహారపు అలవాట్లలో తేడా వచ్చినా భుజాల కండరాల్లో కొవ్వు పేరుకుంటుంది.

Updated : 04 May 2023 07:44 IST

మనం ఏ పని చేయాలన్నా భుజాలు బలంగా ఉండాలి. బలహీనంగా ఉంటే వంటగదిలో చిన్న చిన్న బరువులు ఎత్తేందుకు కూడా సహకరించవు.  ఆహారపు అలవాట్లలో తేడా వచ్చినా భుజాల కండరాల్లో కొవ్వు పేరుకుంటుంది. కాబట్టి ప్రతి రోజూ వాటికి తగిన వ్యాయామం ఇవ్వాలి. అదెలాగో చదివేయండి మరి..

* రోజూ బరువులెత్తే వ్యాయామం చేయటం వల్ల కండరాలు దృఢంగా మారతాయి. నిటారుగా నిలబడి రెండు చేతుల్లో డంబుల్స్‌ పట్టుకొని దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ వాటిని పైకి ఎత్తుతూ దించాలి. ఒక చేతి తర్వాత ఇంకో చేత్తో ఇలాగే చేయాలి. మొదట్లో తేలికపాటి బరువుల్ని మాత్రమే ఎంచుకోవాలి.

* ఆర్మ్స్‌ సర్కిల్‌ రోజూ చేసే వ్యాయామంలో భాగం చేసుకోవాలి. చేతులను ముందుకు చాచి తర్వాత భుజానికి సమాంతరంగా తీసుకురావాలి. వాటిని అలాగే పైకి తీసుకెళ్లాలి. నెమ్మదిగా కిందకి దించాలి. ఇలా రోజూ పది సార్లు చేయాలి. అలవాటయ్యాక ఎక్కువ సార్లు చేసుకోవచ్చు కూడా.. వీటి ద్వారా చేతుల కింద, భుజాల దగ్గరున్న కొవ్వు కరిగి చేతికండరాలు బలంగా మారతాయి.

* భుజాల బలానికి పుషప్‌లు చక్కటి వ్యాయామ మార్గం. ఇవి కేవలం భుజాల దగ్గరే కాకుండా శరీరంలో అదనంగా పేరుకున్న కొవ్వు మొత్తాన్ని కరిగిస్తాయి. ముందుగా నేలపై అరచేతులను ఆనించి బోర్లా పడుకోవాలి. నిదానంగా బరువు మొత్తాన్ని చేతులపై కాళ్ల మునివేళ్లపై వేస్తూ వీలైనంత పైకి లేవాలి. ఇలా సాధ్యమైనన్ని సార్లు చేస్తూ రోజూ కొన్నింటిని పెంచుకుంటూ పోతే శరీరం బలంగా తయారవుతుంది. మెదడుకీ, శరీరానికి మధ్య సమన్వయం కూడా కుదురుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్