Summer: వేసవిలో.. వీటితో జాగ్రత్త!

టీనేజీ అమ్మాయిల నుంచి మహిళల వరకు మనలో చాలామందిలో కనిపించే సమస్య.. హార్మోనుల్లో అసమతుల్యత! అసలే వేసవి. చాలామంది మనసు పర్యటనలపై ఉంటుంది.

Updated : 05 May 2023 10:28 IST

టీనేజీ అమ్మాయిల నుంచి మహిళల వరకు మనలో చాలామందిలో కనిపించే సమస్య.. హార్మోనుల్లో అసమతుల్యత! అసలే వేసవి. చాలామంది మనసు పర్యటనలపై ఉంటుంది. దీంతో తినే ఆహారంపై కాస్త పట్టు విడుస్తాం. సమస్య తీవ్రమవొద్దంటే ఈ కాలం కొన్నింటికి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు..

* సోయా.. సాధారణంగా ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవే! కానీ ఈ కాలంలో దీనిలో ఉండే ఫైటో ఈస్ట్రోజన్‌.. ఈస్ట్రోజన్‌లానే పని చేస్తుందట. దీంతో పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కాబట్టి, సోయాసాస్‌, సోయా మిల్క్‌, చంక్స్‌ వంటి వాటికి దూరంగా ఉండండి.

* పాల పదార్థాలు.. ఇవి ఈ కాలం జీర్ణవ్యవస్థలో ఇన్‌ఫ్లమేషన్‌కి తద్వారా హార్మోనుల్లో అసమత్యులతకూ కారణమవుతాయట. ఒక్కోసారి చెడు కొవ్వులు పేరుకోవడానికీ దారితీస్తాయట. హార్మోనుల అసమతుల్యత సమస్య ఉన్న వారు ఈ కాలంలో వీలైనంత వరకూ పాలు, పాలపదార్థాలను తగ్గించడమే మేలు.

* చక్కెర.. తీపి పదార్థాలు, కృత్రిమ చక్కెరలు జీర్ణాశయంలోని మేలు చేసే సూక్ష్మజీవులపై ప్రభావం చూపుతాయి. దీంతో పదే పదే ఆకలి వేస్తున్నట్లు అనిపించి, ‘అతి’గా తినడం వైపునకు మనసు మళ్లుతుంది. ఇదీ హార్మోనులపై ప్రభావం చూపేదే. వీలైనంత వరకూ చాక్లెట్లు, స్వీట్లతోపాటు జంక్‌ ఫుడ్‌కీ దూరంగా ఉండాలి. తీపి తినాలనిపిస్తే బెల్లాన్ని ఆశ్రయించడం మేలు.

* కెఫిన్‌.. నిద్ర మత్తు పోగొట్టుకోవడానికే కాదు.. కాస్త మనసు చిరాగ్గా తోచినా, ఒత్తిడి అనిపించినా మనసు కాఫీ, టీలవైపు మళ్లుతుంది. శరీరంలో కెఫిన్‌ స్థాయులు పెరిగితే నిద్రపై తద్వారా హార్మోనులపై దుష్ప్రభావం పడుతుంది. రెండు కప్పులకు మించి తీసుకోవద్దు. వేడికి ఐస్‌క్రీమ్‌ల వైపూ మనసు మళ్లుతుంటుంది. దీనివల్లా శరీరంలో కార్టిసాల్‌ స్థాయులు పెరుగుతాయి. ఇదీ శరీరానికే చేటే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్