అవి ఉంటే తినొద్దు!

ఆరోగ్య స్పృహ ఇప్పుడు బాగా పెరిగింది. తినే ప్రతిదానిలో ఒక్కో కెలొరీనీ లెక్కేసుకుని తినే అమ్మాయిలు చాలా మందే. అయితే, వీరు ఏ పదార్థం లో ఫ్యాట్‌.. అన్నా సరే, హమ్మయ్య అనుకుని ఎంచక్కా తినేస్తుంటారు, తాగేస్తుంటారు. మరి అవి నిజంగా ఆరోగ్యకరమేనా?

Published : 09 May 2023 00:27 IST

ఆరోగ్య స్పృహ ఇప్పుడు బాగా పెరిగింది. తినే ప్రతిదానిలో ఒక్కో కెలొరీనీ లెక్కేసుకుని తినే అమ్మాయిలు చాలా మందే. అయితే, వీరు ఏ పదార్థం లో ఫ్యాట్‌.. అన్నా సరే, హమ్మయ్య అనుకుని ఎంచక్కా తినేస్తుంటారు, తాగేస్తుంటారు. మరి అవి నిజంగా ఆరోగ్యకరమేనా?

* సహజ ఉత్పత్తి, కొవ్వులు తక్కువ అని రాసి ఉంది సరే... కానీ, అందులో చక్కెరలూ ఉంటాయి కదా మరి. అవి ఎక్కువగా ఉంటే ప్రమాదమే! కాబట్టి, యాడెడ్‌ షుగర్‌ అని ఉన్నా తినకూడదు. కాటన్‌ సీడ్‌ ఆయిల్‌, పామ్‌ ఆయిల్‌, గ్లూటెన్‌, హైడ్రోనేటెడ్‌ ఫ్యాట్‌, కార్న్‌ సిరప్‌ వంటివన్నీ ఈ తరహావే. ఆరోగ్యానికి చేటు చేసేవే!

* ఉత్పత్తుల నిల్వకి, రుచి మారకుండా ఉండటానికి తయారీదారులు కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్‌, ఫ్లేవర్లు వంటివి వాడుతుంటారు. ఇవి కాలేయంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలాంటి వాటినీ పక్కన పెట్టేయడమే మంచిది.

* కెలొరీలు తక్కువ అని కొనేస్తున్నారా? మీరు లీటర్‌ జ్యూస్‌ ప్యాక్‌ కొన్నారనుకుందాం. పెద్దగా కనిపించే కెలోరీల సంఖ్యను చూసి పర్లేదని కొంటాం. కానీ పక్కన బ్రాకెట్‌లో ప్రతి 200 ఎంఎల్‌కి ఇన్ని కెలొరీలు అని ఉండటాన్ని మాత్రం గమనించం. లీటర్‌కి ఎన్ని కెలొరీలు వస్తున్నాయో లెక్కేసుకొని అప్పుడూ ఫర్లేదనిపిస్తేనే తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్