శాఖాహారులకు ప్రొటీన్లు ఎలా!
శారీరక ఎదుగుదలకూ, జీవక్రియల చురుకుదనానికీ ఎముక వృద్ధికీ, కండరాల ఆరోగ్యానికీ...ప్రొటీన్లు ఎంతో అవసరం. మాంసాహారులకు ఇవి పుష్కలంగా అందుతాయి. మరి శాకాహారుల మాటేంటి అంటారా? మీకోసమే ఈ ప్రత్యామ్నాయ ఆహారాలు.
శారీరక ఎదుగుదలకూ, జీవక్రియల చురుకుదనానికీ ఎముక వృద్ధికీ, కండరాల ఆరోగ్యానికీ...ప్రొటీన్లు ఎంతో అవసరం. మాంసాహారులకు ఇవి పుష్కలంగా అందుతాయి. మరి శాకాహారుల మాటేంటి అంటారా? మీకోసమే ఈ ప్రత్యామ్నాయ ఆహారాలు.
* సోయాబీన్స్ నుంచి ఒక రోజుకు అవసరం అయిన మాంసకృత్తుల్లో 72 శాతం పొందవచ్చు. ఇందుకోసం మనం ఆహారంలో 30 గ్రాముల సోయాబీన్స్‌ని చేర్చుకోవాలి. ఆ తర్వాత పొట్టుతీయకుండా వేసే పెసరట్ల నుంచి కూడా అత్యధికంగా ఆ పోషకాలను అందుకోవచ్చు. ఇవి లేనప్పుడు బీన్స్‌ని కూరల్లో వాడుకోవచ్చు.
* నువ్వులూ, అవిసెగింజలూ, గుమ్మడిగింజల్లో ఏదో ఒక రకాన్ని పెద్ద చెంచా చొప్పున ఆహారంలో చేర్చుకున్నా రోజువారీ అవసరాల్లో 30 శాతం మాంసకృత్తుల అవసరం తీరిపోతుంది.
* పిస్తా, జీడిపప్పుతో పోలిస్తే బాదం నుంచి మాంసకృత్తులు అధికంగా అందుతాయి. ఇందుకోసం మరీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓ ఇరవై గ్రాములు తింటే చాలు.
* దంపుడు బియ్యంతో పోలిస్తే మొక్కజొన్నలో మాంసకృత్తులు అధికం. సగం పొత్తు తిన్నా రోజువారీ అవసరాల్లో 18 శాతం అందుతాయి.
* గుడ్డుతో సమానంగా పీనట్‌బటర్ నుంచి ఒక రోజుకు అవసరం అయిన ప్రొటీన్లలో సగం అందుతాయి. అయితే రోజూ కాకుండా అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది. పాలతో పోలిస్తే పెరుగు నుంచి అందే మాంసకృత్తులు అధికం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.