ఆహారమూ పరిష్కారమే..
ఇంటి పని, ఆఫీసు పని ఒత్తిడికి సెలవులతో పిల్లల అల్లరి కూడా తోడైంది. అధిక ఒత్తిడికి లోనై ఇబ్బంది పడకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలే చేస్తాం. యోగా, వ్యాయామంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. అవేంటో చదివేయండి మరి..
ఇంటి పని, ఆఫీసు పని ఒత్తిడికి సెలవులతో పిల్లల అల్లరి కూడా తోడైంది. అధిక ఒత్తిడికి లోనై ఇబ్బంది పడకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలే చేస్తాం. యోగా, వ్యాయామంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. అవేంటో చదివేయండి మరి..
అరటిపండు.. దీంట్లో ఉండే విటమిన్ బి6 మనసును ప్రశాంతంగా ఉంచేందుకు డొపమైన్, సెరటోనిన్‌ని విడుదల చేస్తుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉన్నా చిరాకు కలుగుతుందని ఒక కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. అరటి పండులో ఉండే చక్కెర స్థాయులు రక్తంలో ఉండాల్సిన చక్కెర స్థాయుల్ని సమన్వయం చేస్తాయి. జీర్ణవ్యవస్థలో కూడా గట్ బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. ఇది మూడ్ డిజార్డర్స్‌ని అదుపులో ఉంచుతుంది.
గుడ్లు.. భావోద్వేగాల్ని బ్యాలెన్స్ చేసేందుకు గుడ్డు చక్కటి ఆయుధంలా పనిచేస్తుంది. దీంట్లో అధికంగా ఉండే ప్రొటీన్లు, విటమిన్ ఎ, డి, బి12లు నరాల వ్యవస్థ పనితీరును ఆధీనంలో ఉంచుతాయి. తక్షణ శక్తినందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు రోజంతా తాజాగా ఉంచుతాయి.
చియా సీడ్స్.. ఇవీ సబ్జా గింజలు ఒకేలా ఉండటం వల్ల చియా సీడ్స్ అంటే సబ్జా అని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ చియా గింజలు వేరు. వీటిలో ఒమెగా 3 యాసిడ్స్, ప్రొటీన్లు, ఫైబర్, క్యాల్షియం ఉంటాయి. ఉత్సాహాన్నిచ్చి, ఒత్తిడి తగ్గించేందుకు, భావోద్వేగాలను అదుపులో ఉంచేందుకు, ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.