కీరదోస ఎంత మంచిదో!

ఎండలు తీవ్రంగా ఉన్నాయి కదూ! ఆ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే అందుకు తగిన ఆహారం తీసుకోవాలి. లేదంటే శక్తి నశిస్తుంది. ఏ పనీ చేయాలనిపించదు.

Updated : 17 May 2023 02:26 IST

ఎండలు తీవ్రంగా ఉన్నాయి కదూ! ఆ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే అందుకు తగిన ఆహారం తీసుకోవాలి. లేదంటే శక్తి నశిస్తుంది. ఏ పనీ చేయాలనిపించదు. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కీరదోస కాపాడుతుంది. ఆ సుగుణాలేంటో తెలుసుకుందామా...

* కీరదోసలో సి, కె విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియంలు విస్తారంగా ఉన్నందున ఇది మంచి పోషకాహారం. రోజూ తీసుకుంటే ఒంట్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

* వేడిని పోగొట్టి సేదతీర్చడంలో కీర దోస అమోఘం. ఇందులో అధికశాతం నీరు ఉంటుంది కనుక ఈ కాలంలో ఎదురయ్యే డీహైడ్రేషన్‌ సమస్యను నివారిస్తుంది.

* కీరదోస శరీరంలో చేరిన దోషాలను నివారిస్తుంది. రక్తపోటును నివారిస్తుంది. దీనిలోని పీచు పదార్థం అధికంగా ఉన్నందున జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో చేరిన వ్యర్థాలను తొలగించి, పొట్ట, పేగులను శుభ్రపరుస్తుంది.

* ఇందులో క్యాన్సర్‌ నిరోధక గుణాలున్నాయి. మనల్ని భయపెడుతున్న రొమ్ము, అండాశయ క్యాన్సర్ల నుంచి రక్షణ ఇస్తుంది. 

* ఈ ముక్కలను కళ్ల మీద పెట్టుకుంటే చలవ చేస్తుంది. కళ్లు ఎర్రబారడం, దురద, మంటలకు ఔషధంలా పనిచేస్తుంది.

* దోస గుజ్జును చేతులకు, పాదాలకు పట్టించడం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి. చర్మం మీద చేరిన మలినాలు, మృతకణాలు నశిస్తాయి. మోచేతులు, మోకాళ్ల వద్ద నలుపు మాయమై నునుపుదనం వస్తుంది.

* విడిగా దోస ముక్కలు తినలేమనుకుంటే సలాడ్‌ రూపంలో తినొచ్చు. పెరుగు లేదా మజ్జిగలో వేసి తినొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్