నిద్రలోకి జారుకోండిలా...

మన దేశ జనాభాలో 36 శాతం మంది మహిళలు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక ఒత్తిడి, ఆందోళనలతో నిద్రకు దూరమై ఎంతో మంది మహిళలు అనారోగ్యాల బారిన పడుతున్నారు.

Published : 17 May 2023 00:25 IST

మన దేశ జనాభాలో 36 శాతం మంది మహిళలు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక ఒత్తిడి, ఆందోళనలతో నిద్రకు దూరమై ఎంతో మంది మహిళలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. నిద్రలేమి సమస్యల నుంచి బయటపడి ప్రశాంతమైన నిద్రలోకి జారుకునేందుకు సహకరిస్తుందీ పరికరం.

ఎలా వాడాలి

ఈ మ్యూస్‌ బ్యాండ్‌ని సాధారణ హెయిర్‌ బ్యాండ్‌లానే ధరించాలి. స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానమై పనిచేస్తుందీ పరికరం. యాప్‌లోకి వెళ్లి.. నిర్ణీత సమయాన్ని ఎంచుకుని ధ్యానం అనే ఆప్షన్‌లోకి వెళ్తే చాలు. నెమ్మదిగా మనం ధ్యానంలోకి వెళ్లేందుకు సహకరిస్తుంది. అనవసరపు ఆలోచనలు పోగొట్టి, ప్రశాంతంగా నిద్రపట్టేట్టు చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని