సొరకాయతో ఆరోగ్యం..

సొరకాయ అంటే కొందరికి అంతగా నచ్చకపోవచ్చు కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్య నిపుణులు. దీని వల్ల శరీరానికి వచ్చే లాభాలు అన్నీ, ఇన్నీ కావు.

Published : 30 May 2023 00:01 IST

సొరకాయ అంటే కొందరికి అంతగా నచ్చకపోవచ్చు కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్య నిపుణులు. దీని వల్ల శరీరానికి వచ్చే లాభాలు అన్నీ, ఇన్నీ కావు.

* ఇన్‌ఫెక్షన్‌ రాకుండా: దీన్ని క్రమం తప్పక తీసుకోవడం వల్ల దీనిలో ఉండే విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు మహిళలు తరచు ఎదుర్కొనే మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.

* జీర్ణశక్తికి సహాయం: ఇందులో 96శాతం నీరే. దాని వల్ల ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి తోడ్పడుతుంది.

* డయాబెటిస్‌:  రక్తంలో చక్కెర స్థాయిల  ఆకస్మిక పెరుగుదలను సొరకాయ నిరోధిస్తుంది. క్లోమగ్రంథి. పని తీరును మెరుగుపరచడంలో సహాయ పడుతుంది. దీంట్లో పీచుపదార్థం ఎక్కువ, కెలోరీలు తక్కువ. బీపీ ఉన్నవారికీ మంచి ఆహారం.

* డయేరియా:  జీర్ణ సమస్యల నివారణలో సొర అద్భుతంగా పని చేస్తుంది. దీని రసానికి చిటికెడు ఉప్పు కలిపి మూడు రోజులు తీసుకుంటే కడుపులో ఎలాంటి ఇన్ఫెక్షన్‌ ఉన్నా త్వరగా తగ్గిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్