ఎండాకాలం చల్లగా, హాయిగా..

అదిరే ఈ ఎండల్లో నూనె పదార్థాలు పెద్దగా రుచించవు. చల్లటివి తినాలి, తాగాలి అనిపిస్తుంది. అలాగని వంటింట్లో చెమటలు కక్కుతూ గంటల తరబడి శ్రమించాలంటే కష్టం. అందుకే తేలిగ్గా, త్వరగా పూర్తయ్యే ఇలాంటివి ప్రయత్నించండి.

Published : 01 Jun 2023 00:19 IST

అదిరే ఈ ఎండల్లో నూనె పదార్థాలు పెద్దగా రుచించవు. చల్లటివి తినాలి, తాగాలి అనిపిస్తుంది. అలాగని వంటింట్లో చెమటలు కక్కుతూ గంటల తరబడి శ్రమించాలంటే కష్టం. అందుకే తేలిగ్గా, త్వరగా పూర్తయ్యే ఇలాంటివి ప్రయత్నించండి. పిల్లలూ, పెద్దలూ అందరూ ఇష్టంగా ఆరగిస్తారు...

* ఈ కాలం కాఫీ, టీలకు బదులు మజ్జిగ, రాగిజావ, నిమ్మకాయ షర్బత్‌, పుచ్చకాయ జ్యూస్‌, కర్బూజా రసం- లాంటివి నోటికి హితవుగా ఉంటాయి, ఆరోగ్యానికీ మంచిది.

* కస్టర్డ్‌ పౌడర్లలో నచ్చిన ఫ్లేవర్‌ తెచ్చుకుంటే నిమిషాల్లో కస్టర్డ్‌ తయారైపోతుంది. యాపిల్‌, అరటి, కర్బూజా లాంటి పండ్ల ముక్కలు కలిపితే పసందుగా ఉంటుంది.

* ముందు రాత్రి నానబెట్టిన పెసలు, శనగల్లో ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి తింటే జిహ్వకు రుచిగా ఉండటమే కాదు, మంచి పోషకాహారం కాబట్టి ఎండలకు నీరసమూ రాదు.

* కీర దోసను సగానికి చీల్చినట్లు కోసి అందులో గింజలు తీసేసి ఉల్లి, టమాటో ముక్కలు, నానబెట్టిన శనగలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసాలతో చేసే ‘కుకుంబర్‌ బోట్స్‌’ నోరూరించేలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. తీపి ఇష్టపడే వాళ్లు ఉప్పు బదులుగా పంచదార వేసుకుంటే అదో గమ్మత్తయిన రుచి.

* యాపిల్‌ లేదా పీచ్‌తో మిల్క్‌ షేక్‌ చేయమంటే పిల్లలు కూడా సులభంగా, సరదాగా చేసేస్తారు.

* రసాయనాల కూల్‌ డ్రింక్స్‌ ఎంత హానికరమో తెలుసు కనుక మామిడి, సపోటా లాంటి ఈ కాలపు తాజా పండ్లరసం తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

*  ఉల్లి, టొమాటోల స్టఫ్‌తో బ్రెడ్‌ శాండ్‌విచ్‌, గ్రీన్‌చట్నీ ఈ కాలంలో సులువుగా చేసుకునే చక్కటి అల్పాహారం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్