మీ కళ్లు చల్లగుండ..

ఉద్యోగమో, కాలక్షేపమో గంటల తరబడి ఫోన్లలో, ల్యాప్‌టాప్‌లో చూడాల్సి రావచ్చు. వీటి నుంచి వెలువడే నీలికాంతితో తలనొప్పి, కళ్లనుంచి నీరుకారడం వంటివి మొదలవుతాయి. ఒత్తిడి మరీ ఎక్కువైతే కంటి చూపు తగ్గే ప్రమాదం ఉంది.

Published : 01 Jun 2023 00:19 IST

ఉద్యోగమో, కాలక్షేపమో గంటల తరబడి ఫోన్లలో, ల్యాప్‌టాప్‌లో చూడాల్సి రావచ్చు. వీటి నుంచి వెలువడే నీలికాంతితో తలనొప్పి, కళ్లనుంచి నీరుకారడం వంటివి మొదలవుతాయి. ఒత్తిడి మరీ ఎక్కువైతే కంటి చూపు తగ్గే ప్రమాదం ఉంది. వీటి నుంచి బయటపడేందుకు నిపుణులేం చెబుతున్నారంటే...

కళ్లద్దాలతో.. తెర నుంచి వెలువడే నీలికాంతి ప్రభావాన్ని నివారించడానికి రీడింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుంటే కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కంటి నుంచి నీరు కారే సమస్యా ఉండదు.

చల్లదనాన్నిచ్చేవి.. కీరదోస ముక్కల్ని రోజూ కాసేపు కళ్లపై ఉంచుకోవాలి. టీ బ్యాగును కాసేపు నీళ్లలో ముంచి లేదా ఫ్రిజ్‌లో ఉంచి తీసి కళ్ల మీద పెట్టుకోవాలి. రాత్రి రోజ్‌వాటర్‌లో  దూదిని ముంచి కూడా ఇలా చేయొచ్చు. వీటిలోని  ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వేడి తగ్గించి కళ్లను చల్లబరుస్తాయి.

కాటుకతో... బాదం నూనె లేదా నెయ్యిని కాటుకలా పెట్టుకోవాలి. ఇవి కన్నీటి నాళాలను ప్రేరేపిస్తాయి. దాంతో కళ్లల్లో ఉండే దుమ్ము, అలర్జీ కారకాలు వంటివి కన్నీటితో బయటకు వచ్చేస్తాయి. మంటా తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్