ఆరోగ్యానికి ఆరు కూరగాయలు

బయటి తినుబండారాల కంటే తాజా కూరగాయలతో ఇంట్లో వండుకుని తినడం ఉత్తమం అని తెలిసిందే. ముఖ్యంగా ఈ ఆరూ మరింత శ్రేష్ఠమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Updated : 03 Jun 2023 04:54 IST

బయటి తినుబండారాల కంటే తాజా కూరగాయలతో ఇంట్లో వండుకుని తినడం ఉత్తమం అని తెలిసిందే. ముఖ్యంగా ఈ ఆరూ మరింత శ్రేష్ఠమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటి వల్ల ప్రయోజనాలేంటో చూద్దామా...

క్యారెట్‌... ఇందులో ఎ-విటమిన్‌ పుష్కలంగా  ఉండటాన కంటిచూపు మెరుగుపడుతుంది. రేచీకటి సమస్యను దరిచేరనివ్వదు. క్యారెట్‌లోని పీచు జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్ధకపు సమస్య తలెత్తదు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. వీటిలోని కెరోటినాయిడ్స్‌ రోగాల బారిన పడకుండా రక్షిస్తాయి.

బీట్‌రూట్‌... యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉన్నందున రక్తపోటు, ఇన్సులిన్‌ సమస్యలను రానివ్వవు. బీట్‌రూట్‌లోని ఫొలేట్‌ ఎర్రరక్త కణాలను వృద్ధిపరిస్తే, నైట్రేట్స్‌ చురుగ్గా, ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.

ముల్లంగి... ఫొలేట్‌, పొటాషియం, పీచు, విటమిన్లు ఉన్నందున మంచి పోషకాహారం. ఇది గుండె, పేగులు, కాలేయం, మూత్రపిండాలకు మంచిది. మధుమేహం, క్యాన్సర్‌లను నియంత్రిస్తుంది. ఊబకాయం రాకుండా కాపాడుతుంది.

వంకాయ... రుచికి రాణీ. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు వ్యాధుల బారిన పడనివ్వవు. ఇది గుండెకు రక్షణగా నిలుస్తుంది.

రెడ్‌ క్యాప్సికం... బెల్‌పెప్పర్‌గా ప్రసిద్ధమైన ఎర్రటి క్యాప్సికంలో పీచు, పొటాషియం, ఎ, సి, విటమిన్లు ఉంటాయి. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు యు.వి.కిరణాలు చర్మానికి హాని చేయకుండా అడ్డుకుంటాయి. దీన్ని తినడం వల్ల శరీరానికి అవసరమైన కొల్లాజన్‌ తగినంత ఉత్పత్తి అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటిచూపు మెరుగు పడుతుంది. బి6 విటమిన్‌ ఉల్లాసంగా ఉంచుతుంది.

బీన్స్‌... శరీరానికి అవసరమైన అనేక విటమిన్లను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్