సీడ్‌ సైక్లింగ్‌ చేద్దామా!

సైక్లింగ్‌ అనగానే వ్యాయామం అనుకోవద్దు. మనలో ఎక్కువగా కనిపిస్తోన్న సమస్య హార్మోనుల్లో అసమతుల్యత. దీంతో నెలసరి ఇబ్బందులు.. శారీరక, మానసిక సమస్యలు. దానికి పరిష్కారమే సీడ్‌ సైక్లింగ్‌.

Published : 04 Jun 2023 00:20 IST

సైక్లింగ్‌ అనగానే వ్యాయామం అనుకోవద్దు. మనలో ఎక్కువగా కనిపిస్తోన్న సమస్య హార్మోనుల్లో అసమతుల్యత. దీంతో నెలసరి ఇబ్బందులు.. శారీరక, మానసిక సమస్యలు. దానికి పరిష్కారమే సీడ్‌ సైక్లింగ్‌. అంటే కొన్నిరకాల విత్తనాలు ఓ క్రమంలో తినడమన్నమాట. దీనిలో రెండు దశలుంటాయి. పీసీఓఎస్‌, మెనోపాజ్‌.. ఇలా హార్మోనుల సమస్య ఉన్నవారెవరైనా ప్రయత్నించొచ్చు. అనుసరణ విధానాన్ని నిపుణులు సూచిస్తున్నారిలా..

* మొదటి దశ.. దీన్నే ఫాలిక్యులర్‌ దశ అనీ అంటారు. నెలసరి మొదలైనప్పటి నుంచి 16వ రోజు వరకు ఉంటుంది. ఈ రోజుల్లో స్పూను చొప్పున వేయించిన అవిసెలు, గుమ్మడి గింజలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇవి ఈస్ట్రోజన్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులను క్రమబద్ధీకరిస్తాయి.

* రెండో దశ.. దీనికి లూటియల్‌ దశగా పేరు. 17 నుంచి 29వ రోజు వరకు దీని కింద పరిగణిస్తారు. ఈరోజుల్లో వేయించిన పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులను స్పూను చొప్పున ప్రతిరోజూ తీసుకోవాలి. ఇలా కొన్ని నెలలు చేసి చూడండి. వీటిల్లోని గుణాలు శరీరంలోని హార్మోనుల అసమతుల్యతను సరిచేసి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని