సంతాన సామర్థ్యాన్ని పెంచే జామ!
పచ్చగా నవనవలాడే జామ పండుని చూసి మనసు పారేసు కోనివారెవరో చెప్పండి. అయితే, ఇది రుచిలోనే కాదు... పోషకాలను శరీరానికి అందించడంలోనూ మేటే.
పచ్చగా నవనవలాడే జామ పండుని చూసి మనసు పారేసు కోనివారెవరో చెప్పండి. అయితే, ఇది రుచిలోనే కాదు... పోషకాలను శరీరానికి అందించడంలోనూ మేటే. మరి ఈ పోషకాల ప్రయోజనాలు తెలుసుకుందామా!
* జామపండులో పీచు ఎక్కువ. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ. అందువల్లే మనకు అకస్మాత్తుగా చక్కెర నిల్వలు పడిపోకుండా చేసి సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే రక్తపోటునూ అదుపులో ఉంచుతుంది. ఇందులోని ట్రైగ్లిజరాయిడ్లు చెడు కొవ్వుని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
* జామలో విటమిన్ సి, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఇక, ఈ పండులో ఉండే మెగ్నీషియం... శరీరం ఇతర పోషకాలను సరిగా స్వీకరించేలా చేస్తుంది.
* జామ శరీరం నుంచి హానికారక ఫ్రీరాఢికల్స్‌ను బయటకు పంపి.. శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధికాకుండా అడ్డుకుంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ నిరోధకంగానూ పనిచేస్తుంది.
* ఫైబర్ ఎక్కువగా ఉండే జామపండు జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. బరువుని అదుపులో ఉంచుతుంది. ఇక, ఇందులోని ఫోలేట్ సంతాన సామర్థ్యాన్ని పెంచితే, ఫోలిక్ యాసిడ్ గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.