గుండెకు గుమ్మడి మేలు

వేసవి వచ్చిందంటే చాలు... బూడిద గుమ్మడితో ఎన్నెన్నో పదార్థాలు తయారు చేస్తుంటారు. మనం వడియాలు పెడితే, ఉత్తరాదిలో స్వీట్లు చేస్తారు. ఈ కాయలోని గుజ్జుతో పాటు తీగ, గింజల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటారు పోషకాహార నిపుణులు.

Published : 07 Jun 2023 00:05 IST

వేసవి వచ్చిందంటే చాలు... బూడిద గుమ్మడితో ఎన్నెన్నో పదార్థాలు తయారు చేస్తుంటారు. మనం వడియాలు పెడితే, ఉత్తరాదిలో స్వీట్లు చేస్తారు. ఈ కాయలోని గుజ్జుతో పాటు తీగ, గింజల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటారు పోషకాహార నిపుణులు. అవేంటంటే...

బరువు తగ్గిస్తుంది... రోజూ ఓ గ్లాసు బూడిద గుమ్మడి రసం తాగితే...కడుపు నొప్పి, గ్యాస్‌ సమస్యలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గించడంలోనూ దీనిది ప్రత్యేక పాత్రే. ఇందులో అధికశాతం నీరు, పీచు పదార్థాలు, తక్కువ కార్బోహైడ్రేట్స్‌ బరువుని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

వ్యాధి నిరోధక శక్తికి... జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కోసం బూడిద గుమ్మడి రసంలో కొద్దిగా కారం, నిమ్మరసం కలిపి తాగితే చక్కని ఫలితం ఉంటుంది. దీనిలో విటమిన్‌ సి, బి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధకశక్తి మెరుగు పడుతుంది.

గుండె బలానికి... గుండె సంబంధిత సమస్యలున్నవారు గుమ్మడిని రోజూ ఆహారంలో చేర్చుకుంటే మేలు. ముఖ్యంగా కొవ్వులు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల గుండె కండరాలకు బలాన్ని చేకూర్చి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్