పేను కొరుకు సమస్యకు వెల్లుల్లి

కొంత మంది మహిళల్లో పోషకాహార లోపం, కాలుష్యం కారణంగా జుట్టు పల్చబడుతుంది. కొందరిలో పేను కొరుకు సమస్య ఉంటుంది.

Updated : 08 Jun 2023 07:18 IST

కొంత మంది మహిళల్లో పోషకాహార లోపం, కాలుష్యం కారణంగా జుట్టు పల్చబడుతుంది. కొందరిలో పేను కొరుకు సమస్య ఉంటుంది. వీటికి ఇంట్లో దొరికే పదార్థాలతోనే చెక్‌ చెప్పొచ్చు అంటున్నారు నిపుణులు...

బంగాళదుంప, వెల్లుల్లి... పేను కొరికి, జుట్టు పలుచపడిన చోట బంగాళాదుంప, వెల్లుల్లి రసం మిశ్రమాన్ని దూదితో రుద్దాలి. చివరిగా కాఫీపొడి, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని రాసి ఆరాక కడిగేయాలి. ఇలా వారానికి నాలుగు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

ఒతైన జుట్టు కోసం... ఒక కప్పు ఆలివ్‌ లేదా కొబ్బరి నూనెలో పది వెల్లుల్లి రెబ్బలు బరకగా దంచి వేయాలి. దీనిని ఐదునిమిషాలు మరిగించి చల్లారిన తర్వాత తలకు పట్టించాలి. రెండు గంటల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే కురులు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి. వెల్లుల్లిలో ఉండే బి1, బి2, యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి.

చుండ్రు నివారణకు... రెండు ఉల్లిపాయలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక  స్పూన్‌ మెంతులను మిక్సీ పట్టాలి. దాన్ని కప్పు కొబ్బరి నూనెలో వేసి ఐదు నిమిషాలు స్టౌ పై పెట్టి మరిగించాలి. చుండ్రు నివారణకు, పొడవైన కురుల కోసం దీనిని వారానికి రెండుసార్లు రాస్తే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని