పాలంటే పాలు కాదండోయ్!
పాల వాసన కొందరికి నచ్చక తాగరు. మరికొందరేమో సరిపడక తీసుకోరు. అయితే ప్రొటీన్, క్యాల్షియంతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే వీటికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అని వెతుకుతున్నారా? ఇవి మీకోసమే...
పాల వాసన కొందరికి నచ్చక తాగరు. మరికొందరేమో సరిపడక తీసుకోరు. అయితే ప్రొటీన్, క్యాల్షియంతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే వీటికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అని వెతుకుతున్నారా? ఇవి మీకోసమే...
కొబ్బరి పాలు: పచ్చి కొబ్బరిని ముక్కలుగా కోసి మిక్సీ పట్టి పాలను తీయొచ్చు. వంటకాల్లోనూ విరివిగా ఉపయోగిస్తారు. ఈ పాలకు కాస్త పంచదార కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి. ఆర్థరైటిస్ సమస్య అదుపులో ఉంటుంది.
కాజూ మిల్క్: ఇది చిక్కగా, కమ్మని రుచిలో ఉంటుంది. ఇది సహజంగానే గ్లూటెన్ ఫ్రీ. కెలొరీలు తక్కువగా ఉంటాయి. క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా లభించడం వల్ల గుండె, ఎముకలు ఆరోగ్యంగానూ ఉంటాయి.
సోయా పాలు: పాలకు తగిన పోషకాల ప్రత్యామ్నాయం సోయాపాలు. ఎండిన సోయా బీన్స్‌ని నీళ్లల్లో నానబెట్టి ఈ పాలను తీయవచ్చు. లాక్టోజ్ పడనివాళ్లు కూడా దీన్ని ప్రయత్నించవచ్చు. ఈ పాలను తాగితే రక్తనాళాలు బలపడతాయి. మెనోపాజ్ చిక్కులకు పరిష్కారం లభిస్తుంది. దీనిలో తక్కువ శాచురేటెడ్ ఫ్యాట్‌లూ, చక్కెరా ఉంటాయి.
రైస్ మిల్క్: ఇప్పుడిప్పుడే పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి ఈ రైస్ మిల్క్. ముఖ్యంగా బ్రౌన్‌రైస్‌తో చేసే పాలల్లో పోషకాలెన్నో. ఇందులోని క్యాల్షియం ఎముకల్ని బలంగా మారుస్తాయి. రకరకాల ఫ్లేవర్స్‌లో దొరికే ఇవి ఎంతో రుచికరం.
బాదం పాలు: ఇవి చాలామంది ఫేవరెట్. బాదం గింజల్ని నానబెట్టి పాలు తీయడం కూడా సులువే. ఈ పాలల్లో తగినన్ని ప్రొటీన్‌లూ, యాంటీ ఆక్సిడెంట్‌లూ, విటమిన్ ఈ, ఐరన్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ల వంటివెన్నో విరివిగా లభిస్తాయి. ఇవి అనారోగ్య సమస్యల్ని అదుపు చేయడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.