దానిమ్మ.. గర్భవతికి మేలు!
మనకు విరివిరిగా దొరికే పండ్లలో దానిమ్మ ఒకటి. గింజల్లోనే కాదు దాని తొక్కలోనూ ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా?
మనకు విరివిరిగా దొరికే పండ్లలో దానిమ్మ ఒకటి. గింజల్లోనే కాదు దాని తొక్కలోనూ ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా?
వాస్తవానికి దానిమ్మకు సంబంధించిన వేరు, ఆకులు, పువ్వులు, బెరడు, గింజలు, అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గర్భవతులకు ఎంతో మేలు చేస్తుంది.
* దానిమ్మ తొక్క వగరుగా ఉంటుందని తెలుసు. అయినా దాన్ని ముక్కలుగా చేసి సలాడ్స్ రూపంలో తినండి. వగరు తగ్గడమే కాదు.. శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* ఈ పండు తొక్కలను నీటిలో వేసి మరిగించి తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* మహిళలు గర్భవతిగా ఉన్న సమయంలో ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది. రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకోవడం వల్ల అది పుష్కలంగా లభిస్తుంది.
* ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది.
* నీళ్ల విరేచనాలు అవుతోంటే.. గ్లాసు దానిమ్మ రసం లేదా ఓ కప్పు గింజలు తీసుకోండి. ఉపశమనం లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.