లవంగాలు చూపే పరిష్కారాలు!

చిన్న చిన్న సమస్యలకు కూడా కొన్ని సార్లు తీవ్రంగా ఆలోచిస్తాం. కానీ, వాటి పరిష్కారాలు మాత్రం మన వంటింట్లోనే దొరుకుతాయి.

Published : 11 Jun 2023 00:08 IST

చిన్న చిన్న సమస్యలకు కూడా కొన్ని సార్లు తీవ్రంగా ఆలోచిస్తాం. కానీ, వాటి పరిష్కారాలు మాత్రం మన వంటింట్లోనే దొరుకుతాయి. అలా ఉపయోగించుకోగల వాటిలో లవంగాలు ఒకటి.

* దుర్వాసనా? కమలాపండుపై కొన్ని లవంగాలను గుచ్చి పెట్టేయండి. నెమ్మదిగా అది సహజ పరిమళాలను వెదజల్లడమే కాదు... దుర్వాసనల్నీ పీల్చేస్తుంది.

* ఇంట్లో ఈగల మోతని భరించలేక పోతుంటే... పెనంపై లవంగాలను వేడి చేసి పొడి చేయాలి. దానికి కాస్త కర్పూరం, రెండు చుక్కల నిమ్మగడ్డి నూనె చేర్చండి. ఆపై పావులీటరు నీళ్లల్లో మిశ్రమాన్ని కలిపి ఇంట్లో అక్కడక్కడా స్ప్రే చేస్తే సరి. సమస్య దూరమవుతుంది.

* బీరువాలు ముక్క వాసన వస్తుంటే... కాస్తంత పచ్చ కర్పూరం, ఐదారు లవంగాలూ, చిన్న దాల్చిన చెక్క ఓ వస్త్రంలో మూటకట్టి పెడితే... ఇబ్బంది తొలగిపోతుంది.

* దోమల బెడదా? వేడి చేసిన లవంగాలను పొడి చేసి పావు కప్పు నీళ్లల్లో కలిపేయాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే చేస్తే దోమలను తరిమేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని