మైగ్రెయిన్‌ను తగ్గించే చిట్కాలు...
చాలామంది మహిళల్లో భరించలేని మైగ్రెయిన్ నొప్పి వస్తూ ఉంటుంది. పోషక విలువలున్న ఆహారం తీసుకోకపోవడంతో కూడా ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
చాలామంది మహిళల్లో భరించలేని మైగ్రెయిన్ నొప్పి వస్తూ ఉంటుంది. పోషక విలువలున్న ఆహారం తీసుకోకపోవడంతో కూడా ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మైగ్రెయిన్‌ను నియంత్రించడానికి కొన్ని ఆహార పదార్థాలను సూచిస్తున్నారు.
- ఆకుకూరలు: ఆకు కూరలు, ఆకుపచ్చ కూరగాయలు శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి. వీటిలోని మెగ్నీషియం, విటమిన్ బి మైగ్రెయిన్‌ను తగ్గిస్తాయి. పచ్చగా ఉన్న కూరగాయలు తినడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు మెరుగుపడి తలనొప్పి దూరం అవుతుంది.
- అరటి పండ్లు: ఈ సమస్యను తగ్గించటంలో అరటిపండు చక్కగా ఉపయోగపడుతుంది. దీనిలో 74శాతం నీరు, ప్రొటీన్లు, విటమిన్‌లు ఉంటాయి. తలనొప్పి అనిపించినప్పుడు అరటిపండు తింటే కొంచెం ఉపశమనం ఉంటుంది.
- చాక్లెట్స్: కొందరు మాములుగానే చాక్లెట్స్ తింటుంటారు. కానీ వాటి కన్నా డార్క్ చాక్లెట్ తినడంవల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మైగ్రెయిన్ నొప్పికి ఉపశమనం దొరుకుతుంది.
- నీరు తాగటం: డీహైడ్రేషన్ కారణంగా మైగ్రెయిన్ కనిపిస్తుంటుంది. తగినంత నీరు తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. .
- పుట్టగొడుగులు: మైగ్రెయిన్ని ఎదుర్కొనడంలో పుట్టగొడుగులు ఉపయోగపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పుట్టగొడుగు, గుడ్లు, నట్స్ వంటి ఆహార పదార్థాలలో రిబోఫ్లావిన్ అధికంగా ఉంటుంది. ఇది తలనొప్పిని తగ్గించడంలో సాయపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.