అలజడిని దూరం చేసే విపరీత కరణి

మనలో చాలామందికి చాలా సార్లు కారణం లేకుండానే మనసులో ఏదో అశాంతిగా, మెదడులో అలజడిగా ఉంటుంది. ఏం చేసి ఆ అయోమయం నుంచి బయటపడాలో తెలీదు. ఇలాంటి స్థితి రాకుండా ఉండేందుకు యోగా చేయమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా విపరీత కరణి అస్థిమితాలను తరిమేస్తుంది. మీరూ ప్రయత్నించండి.

Updated : 17 Jun 2023 00:29 IST

మనలో చాలామందికి చాలా సార్లు కారణం లేకుండానే మనసులో ఏదో అశాంతిగా, మెదడులో అలజడిగా ఉంటుంది. ఏం చేసి ఆ అయోమయం నుంచి బయటపడాలో తెలీదు. ఇలాంటి స్థితి రాకుండా ఉండేందుకు యోగా చేయమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా విపరీత కరణి అస్థిమితాలను తరిమేస్తుంది. మీరూ ప్రయత్నించండి.

ఎలా చేయాలంటే..

విపరీత కరణికి ముందు నాలుగు గంటలు ఏమీ తినకూడదు. కనుక ఉదయం అనుకూలం. చదునుగా ఉన్న నేలమీద యోగా మ్యాట్‌ లేదా దుప్పటి పరిచి వెల్లకిలా పడుకోవాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. పిరుదుల మీద చేతులుంచి నడుం నుంచి కాళ్లను పైకి లేపాలి. మోచేతులను ఆసరాగా ఉంచాలి. కొత్తగా యోగా ఆరంభించినవారు కాళ్లను గోడకు ఆనించి తేలిగ్గా చేయొచ్చు. మొదట్లో ఇబ్బందిగా ఉంటే తల కింద దిండు ఉంచవచ్చు.

ఇవీ ప్రయోజనాలు...

  • మనసు, మెదడు సేదతీరతాయి. అశాంతి, అలజడి తలెత్తవు. డిప్రెషన్‌, యాంగ్జయిటీ లాంటి మానసిక సమస్యల నుంచి బయటపడొచ్చు.
  • తలనొప్పి, మధు మేహం, నిద్రలేమి, నెలసరి, ప్రి-మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌, మెనోపాజ్‌ సమస్యలు తగ్గుతాయి.
  • ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలు నయమవుతాయి.
  • నడుం నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • మెడ, కాళ్లు, చేతులు దృఢంగా అవుతాయి.
  • జీర్ణప్రక్రియ సవ్యంగా ఉంటుంది.

వీరికి మంచిది కాదు...

  • హై బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు దీని జోలికి వెళ్లకూడదు.
  • నడుము, మెడ నొప్పులు తీవ్రంగా ఉన్న వారు యోగా గురువు మార్గదర్శకత్వంలోనే ప్రయత్నించాలి.
  • నెలసరి సమయంలో కూడదు.
  • గ్లకోమా లాంటి తీవ్ర కంటి సమస్యలు ఉన్న వారు దీన్ని చేయవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని