కళ్లకీ కావాలి వ్యాయామం!
కంప్యూటర్ ముందు పనిచేసే వారికే అనుకుంటాం కానీ.. మిగతావాళ్లకీ ఇప్పుడు కళ్ల సమస్యలు సాధారణమే! కాలక్షేపం, పిల్లల ప్రాజెక్టులు, కొత్త వంటలు పేరుతో తెరకు అతుక్కుపోతుండటమే అందుకు కారణం. కాబట్టే.. కళ్లకీ ఈ వ్యాయామాలు అవసరమంటున్నారు నిపుణులు.
కంప్యూటర్ ముందు పనిచేసే వారికే అనుకుంటాం కానీ.. మిగతావాళ్లకీ ఇప్పుడు కళ్ల సమస్యలు సాధారణమే! కాలక్షేపం, పిల్లల ప్రాజెక్టులు, కొత్త వంటలు పేరుతో తెరకు అతుక్కుపోతుండటమే అందుకు కారణం. కాబట్టే.. కళ్లకీ ఈ వ్యాయామాలు అవసరమంటున్నారు నిపుణులు.
కుర్చీ గోడవైపు వేసి దానిలో నిటారుగా కూర్చోవాలి. తలను కదల్చకుండా సూటిగా చూడాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై దృష్టిపెట్టాలి. కొన్నిసెకన్లు అలాగే చూశాక కొద్దిసేపు కళ్లు మూసుకొని తెరవాలి.
* కుర్చీలో కూర్చొని శరీరాన్నీ, తలనీ నిటారుగా ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకునేప్పుడు చూపుని పై వైపునకు. వదిలేప్పుడు కింది వైపునకూ తిప్పుతుండాలి. తల మాత్రం కదలకూడదు. ఇలా నిమిషంపాటు చేయాలి.
* తలను నిటారుగా ఉంచి చూపును కుడివైపునకు మళ్లించి కొన్ని సెకన్లు ఆగండి. ఈసారి అలాగే ఎడమవైపునకు, పైకి, కిందకి చేయాలి. చివరగా రెండు కళ్లతో ముక్కు కొనపైనే దృష్టి ఉంచాలి.
* నేలమీద కాళ్లు ముడుచుకొని కూర్చోవాలి. కుడిచేతి బొటనవేలును కళ్లకు ఎదురుగా ఉంచి కొద్దిసేపు అలాగే చూడాలి. నెమ్మదిగా ఆ వేలును ముక్కుకు ఆనేంత దగ్గరగా తేవాలి. ఈ క్రమంలో దృష్టిమాత్రం వేలిని వదల కూడదు. తర్వాత నెమ్మదిగా దూరంగా జరపాలి. వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి రోజుకు మూడుసార్లు చేయాలి.
వీటితో.. కంటిచూపు మెరుగవడంతో పాటు ఏకాగ్రతా పెరుగుతుంది. కంటి సంబంధిత సమస్యలు దూరంగా ఉంటాయి. ఏకధాటిగా సిస్టమ్ ముందు పనిచేయడం వల్ల వాటిపై పడే ఒత్తిడి వంటివి దూరమై విశ్రాంతి దొరుకుతుంది. మనసుకీ ప్రశాంతత.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.