అలసటా... ఈ ఆసనం వేయండి

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఏవో పనులూ, బాధ్యతలతో తీరిక లేకుండా ఉంటాం. ఒకదాని తర్వాత మరొక పని చేస్తూనే ఉండటం వల్ల శారీరక అలసట, మానసిక ఒత్తిడికి గురవుతుంటాం.

Published : 01 Jul 2023 00:22 IST

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఏవో పనులూ, బాధ్యతలతో తీరిక లేకుండా ఉంటాం. ఒకదాని తర్వాత మరొక పని చేస్తూనే ఉండటం వల్ల శారీరక అలసట, మానసిక ఒత్తిడికి గురవుతుంటాం. అదలాగే కొనసాగితే అన్నింటి మీదా అనాసక్తత ఏర్పడే అవకాశముంది. అలాంటి స్థితి కలగకుండా మనసుని తేలిక పరిచి.... చురుగ్గా ఉంచేందుకు మత్స్య క్రీడాసనం ఉపయోగపడుతుంది. తేలికగా వేయగలిగే ఈ ఆసనాన్ని ప్రయత్నించి చూడండి.

ఎలా చేయాలంటే... మత్స్యక్రీడాసనం కోసం బోర్లా పడుకుని ముఖాన్ని ఎడమవైపునకు తిప్పాలి. రెండు చేతివేళ్లనూ కలిపి కుడి చెంప కింద ఉంచాలి. కుడి మోచేయి పైకి, ఎడమ మోచేయి కిందికి కొంచెం క్రాస్‌గా ఉండేలా చూడాలి. కుడి కాలిని తిన్నగా ఉంచి, ఎడమ కాలిని మోకాలి దగ్గర వంచి ఎల్‌ ఆకృతిలో ఉంచాలి. ఎడమ మోకాలు.. ఎడమ మోచేతికి దగ్గరగా ఉంచాలి.

ఎన్ని ప్రయోజనాలో... ఇతర ఆసనాల వేశాక  మత్స్యక్రీడాసనం చేయడం వల్ల మనసుకి సాంత్వన లభిస్తుంది. ఒత్తిడిగా అనిపించినా, ఆందోళన, అశాంతి కలిగినా, బాగా అలసిపోయినట్లు అనిపించినా ఎక్కువసేపు కసరత్తులు చేసినప్పుడు ఈ ఆసనం చేస్తే పూర్తి విశ్రాంతి కలుగుతుంది. ముఖ్యంగా వెన్నెముక, పిరుదులు, ఉదర భాగం సేదతీరతాయి. నడుం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా లోయర్‌ బ్యాక్‌పెయిన్‌ ఉన్నవాళ్లు ఇది తప్పకుండా సాధన చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని