పేలను తొలగించండిలా
పాఠశాలలకు, కాలేజీలు ప్రారంభమయ్యాయంటే మన అమ్మలకు భయమే. ఎక్కడ్నుంచి వస్తాయోగానీ పిల్లల తలల్లోకి కుప్పలుగా పేలు చేరతాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ ఇంటి చిట్కాలు పాటించండి.
పాఠశాలలకు, కాలేజీలు ప్రారంభమయ్యాయంటే మన అమ్మలకు భయమే. ఎక్కడ్నుంచి వస్తాయోగానీ పిల్లల తలల్లోకి కుప్పలుగా పేలు చేరతాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ ఇంటి చిట్కాలు పాటించండి.
యాపిల్ సిడార్ వెనిగర్... జుట్టు సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. ఇది మాడును శుభ్రపరచడమే కాదు.. పేలు, చుండ్రునీ తగ్గిస్తాయి. అరకప్పు యాపిల్ సిడార్ వెనిగర్‌లో రెండు కప్పుల నీళ్లు కలిపి జుట్టుకు పట్టించండి. పది నిమిషాలాగి దువ్వితే సరి. పేలు బయటకు వచ్చేస్తాయి. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఆలివ్‌నూనె... ఈ నూనె ఎండుగడ్డిలా మారిన జుట్టుకి పోషణ అందించడమే కాదు...పేల సమస్యకీ పరిష్కారం చూపిస్తుంది. ఆలివ్ నూనెని బాగా పట్టించి... కాసేపయ్యాక దువ్వి చూడండి. మూలల్లో దాక్కున పేలు కూడా సులువుగా వచ్చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.