తెరకు దూరంగా
కొవిడ్ వల్ల ఆన్‌లైన్ విద్యపై ఆధారపడ్డ వారి సంఖ్య పెరిగిపోయింది. మహమ్మారి ఉద్ధృతిలో తప్పక చేసిన డిజిటల్ పరికరాల వినియోగం ఇప్పుడు కొనసాగించాల్సి వస్తోంది.
కొవిడ్ వల్ల ఆన్‌లైన్ విద్యపై ఆధారపడ్డ వారి సంఖ్య పెరిగిపోయింది. మహమ్మారి ఉద్ధృతిలో తప్పక చేసిన డిజిటల్ పరికరాల వినియోగం ఇప్పుడు కొనసాగించాల్సి వస్తోంది. మారుతున్న సాంకేతికతను పిల్లలు అందిపుచ్చుకోవాలంటూ చాలా పాఠశాలలు ఫోన్లు, ట్యాబ్‌ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల ఒత్తిడి, కళ్లు పొడిబారడం, తలనొప్పి లాంటి సమస్యలను పిల్లలు ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి బయటపడాలంటే తల్లులు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...
- 20 నిమిషాలకు స్క్రీన్ నుంచి విరామం తీసుకోమనండి. డిజిటల్ పరికరాలు చూసే సమయం రెండు గంటల కంటే ఎక్కువగా లేకుండా చూసుకోండి.
- 20/20 నియమాన్ని అమలులోకి తీసుకురండి. 20 నిమిషాలు స్క్రీన్ చూస్తే తర్వాతి 20 సెకన్లు దూరంగా ఉన్న వస్తువులను చూసే విధంగా దృష్టి పెట్టమని పిల్లల్ని ప్రోత్సహించండి. కళ్ల విశ్రాంతికి ఈ వ్యాయామం బాగా పనిచేస్తుంది.
- కంటి ఒత్తిడిని తగ్గించడానికి తెర వెలుతురు, కాంట్రాస్ట్ సెట్టింగులను సర్దుబాటు చేయండి. బ్లూలైట్ ఫిల్టర్‌ను ఉపయోగించండి.
- పిల్లలను స్నేహితులతో బయట ఆడుకునేలా చూడండి. డిజిటల్ పరికరాల వల్ల వచ్చే మయోపియా ప్రమాదాన్ని తగ్గించిన వారవుతారు.
- కళ్లు పొడిబారడం, నీరు కారడం, దురదలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తే ప్రాథమిక దశలోనే వైద్యుల్ని సంప్రదించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.