మగువల ఆరోగ్యానికి ఈ టీలు
వాతావరణం మారగానే జలుబూ, దగ్గు వంటి అనారోగ్యాలు చుట్టు ముట్టేస్తుంటాయి. వానాకాలంలో ఈ సమస్యలు కాస్త ఎక్కువే. ఇలాంటప్పుడు వేడివేడిగా ఈ హెర్బల్ టీలు తాగి చూడండి.
వాతావరణం మారగానే జలుబూ, దగ్గు వంటి అనారోగ్యాలు చుట్టు ముట్టేస్తుంటాయి. వానాకాలంలో ఈ సమస్యలు కాస్త ఎక్కువే. ఇలాంటప్పుడు వేడివేడిగా ఈ హెర్బల్ టీలు తాగి చూడండి. హాయిగా ఉండటమే కాదు.. వ్యాధినిరోధక శక్తినీ పెంచుతాయి.
బిల్వ ఆకు టీ.. ఈ ఆకులో ఏ,సీ,బీ1, బీ6 విటమిన్లు సహా కాల్షియం, పీచు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచి, నిండైన ఆరోగ్యాన్నిస్తాయి. గ్లాసు నీళ్లలో రెండుమూడు ఈ ఆకులను వేసి మరిగించి వడకట్టి తేనె కలిపి తాగితే...ఎన్నో ప్రయోజనాలు. ముఖ్యంగా ఆహారంలోని పోషకాలను శరీరం త్వరగా గ్రహించేలా చేస్తాయి. వీటిలోని బయో యాక్టివ్ కాంపౌండ్స్ పీసీఓఎస్ సమస్యను రానివ్వవు. మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఎదురయ్యే హృద్రోగ సమస్యల నుంచి పరిరక్షిస్తాయి.
గోధుమ గడ్డి.. ఏ, సీ, ఈ,కే విటమిన్లు మెండుగా ఉండే గోధుమ గడ్డి మహిళల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఐరన్ తక్కువగా ఉన్నవారు రోజూ కప్పు నీటిలో కొంచెం గోధుమ గడ్డి వేసి మరిగించి పావుచెంచా తేనె కలిపి టీగా తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
మెంతి టీ.. బయోటిన్, ఏ, బీ, డీ విటమిన్లు, ఐరన్, పీచు పుష్కలంగా ఉండే ఈ టీ ప్రసవం తర్వాత తల్లిపాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
అశ్వగంధ.. ఆయుర్వేదం మగువల ఆరోగ్యాన్ని పరిరక్షించే సుగుణాలెన్నో దీంట్లో ఉన్నాయంటోంది. ఆందోళన, ఒత్తిడి వంటి వాటిని ఇది దూరం చేస్తుంది. సంతాన సాఫల్య సామర్థ్యాన్ని పెంచుతుంది. థైరాయిడ్‌ను తగ్గిస్తుంది. మెనోపాజ్‌తో ఎదురయ్యే సమస్యలను నియంత్రిస్తుంది. యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. నిద్రలేమికి దూరంగా ఉండొచ్చు. ఎముకల బలహీనతను తగ్గిస్తుంది. ఇందుకోసం పావుచెంచా ఈ పొడిని రెండు కప్పుల నీటిలో మరిగించి చల్లార్చి, తేనె కలిపి రోజూ తీసుకోవాలి.
రెండు మూడు చెంచాల మెంతులను నీళ్లల్లో వేసి మరిగించాలి. ఆపై వడకట్టి... అందులో తేనె కలిపి తీసుకోవచ్చు. దీన్ని రోజులో రెండు సార్లు తాగినా ఆరోగ్యానికి మంచిదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.