వానాకాలంలో చర్మాన్ని రక్షించుకోండిలా
చర్మ సమస్యలు ఎక్కువగా వచ్చేది ఈ కాలంలోనే. వాతావరణంలో తేమ స్థాయులు పెరిగేకొద్దీ ముఖం జిడ్డుగా కనిపిస్తుంది. మెరుపునూ కోల్పోతుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే నిపుణుల చిట్కాలివిగో...
చర్మ సమస్యలు ఎక్కువగా వచ్చేది ఈ కాలంలోనే. వాతావరణంలో తేమ స్థాయులు పెరిగేకొద్దీ ముఖం జిడ్డుగా కనిపిస్తుంది. మెరుపునూ కోల్పోతుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే నిపుణుల చిట్కాలివిగో...
క్లెన్సర్లు... గాఢత ఎక్కువ ఉన్న క్లెన్సర్‌లు చర్మంపై కఠినంగా ఉంటాయి. సహజ నూనెలను తొలగిస్తాయి. దీంతో చర్మం పొడిబారి పోతుంది. సబ్బులేని క్లెన్సర్లని వాడటం వల్ల ఈ సమస్యలు ఉండవు.
స్క్రబ్ చేస్తుండాలి... రోజూ మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. మంచి స్క్రబ్‌ను వాడటం వల్ల ఇది సాధ్యమవుతుంది. మృత కణాలు తొలగి, చర్మరంధ్రాల్లో మలినాలుండవు. ఇలా వారానికి రెండు మూడు సార్లు స్క్రబ్ చేస్తే మంచి ఫలితాలను పొందొచ్చు. చర్మం కాంతిమంతంగా మెరిసిపోతుంది.
తక్కువ మేకప్... వానాకాలంలో మేకప్ వేసుకోకపోవడమే మేలు. తేమ కారణంగా మనం ఎంత మేకప్ వేసినా అది చెదిరి పోతుంది. అందుకే కాస్త ఎక్కువగానే పౌడర్లు వేస్తాం. ఇవి చర్మ రంధ్రాలను మూసుకు పోయేలా చేస్తాయి. అదనపు సీబమ్ ఉత్పత్తికి కారణమవుతాయి. దాంతో ముఖం జిడ్డుగా కనిపిస్తుంది. కన్సీలర్‌లు, ఫౌండేషన్లు లేయర్లుగా వేసే బదులు, సున్నితమైన సీసీ క్రీములను వాడితే సరి. పెదాల కోసం లేత రంగు లిప్‌బామ్‌లను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
టోనర్ వినియోగం... చర్మం జిడ్డుగా, అనిపిస్తే టోనర్‌ని వాడితే మంచిది. ఆల్కహాల్, గ్రీన్‌టీ ఎక్స్‌ట్రాక్ట్‌లున్న టోనర్‌లను ఎంచుకుంటే మేలు.
విటమిన్ సి... ఇది మీ చర్మం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ కాలంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.