చెమటలు పట్టేస్తోంటే..
కంగారు పడినప్పుడో, భయం వేసినప్పుడో, ఉక్కపోతకో చెమట పట్టడం వేరు. కొందరిలో కాలమేదైనా కాళ్లు, చేతుల్లో విపరీతంగా చెమటలొచ్చేస్తాయి. ఏది పట్టుకున్నా తడి, చెప్పులు విడవాలన్నా దుర్వాసన... ఈ ఇబ్బందికి పరిష్కారాలివిగో.
కంగారు పడినప్పుడో, భయం వేసినప్పుడో, ఉక్కపోతకో చెమట పట్టడం వేరు. కొందరిలో కాలమేదైనా కాళ్లు, చేతుల్లో విపరీతంగా చెమటలొచ్చేస్తాయి. ఏది పట్టుకున్నా తడి, చెప్పులు విడవాలన్నా దుర్వాసన... ఈ ఇబ్బందికి పరిష్కారాలివిగో.
⚛ గోరువెచ్చని బ్లాక్ టీలో రోజూ పావు గంట చేతులు, పాదాలను నానబెట్టండి. దీనిలోని టానిన్లు సహజ ఆస్ట్రింజెంట్లలా పనిచేసి, చెమటను నిరోధిస్తాయి. గోరు వెచ్చని నీటిలో కర్పూరం కరిగించి, అందులో చేతులు నానబెట్టినా మంచిదే. అయితే ఆరాక తప్పక టాల్కమ్ పౌడరో, కొబ్బరినూనో పట్టించాలి.
⚛ యాపిల్ సిడార్ వెనిగర్‌లో యాంటీ మైక్రోబియల్ గుణాలెక్కువ. ఇవి సూక్ష్మ జీవులను చంపడమే కాదు.. దుర్వాసననూ దూరం చేయగలవు. అరబకెట్ నీటికి కప్పు వెనిగర్ కలిపి రోజూ పావుగంట చేతులు, పాదాలను నానబెడితే సరి. చర్మంలో పీహెచ్ స్థాయిలను సమన్వయం చేసి, చెమటను తగ్గిస్తుంది. నిమ్మరసాన్ని రాసి, ఆరాక కడిగినా మంచిదే.
⚛ బేకింగ్ సోడాలోనూ చర్మాన్ని పొడిగా మార్చే గుణాలుంటాయి. ఇందులో తగినన్ని నీళ్లు కలిపి చేతులు, పాదాలకు పట్టించి.. ఆరాక నీటితో కడిగేస్తే సరి.
⚛ గంధం పొడికి తగినన్ని నీళ్లు లేదా గులాబీ నీరు చేర్చి పేస్ట్‌లా చేయాలి. దాన్ని చేతులు, పాదాలకు పట్టించి.. ఆరాక కడిగేయాలి. గంధం సహజ ఆస్ట్రింజెంట్‌లా పనిచేస్తూనే చర్మానికి చల్లదనాన్నీ ఇస్తుంది. వారానికి 3-4 సార్లు ప్రయత్నించాలి. వీటితోపాటు టాల్కమ్ పౌడర్ పట్టించడం, గాలిసోకే సాక్సులు, చెప్పులు వేసుకోవడం వంటివీ చేస్తే.. సమస్య అదుపులోకి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.