రక్తహీనతతో బాధపడుతున్నారా?

అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తరచుగా తలనొప్పి రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా?

Updated : 11 Jul 2023 03:29 IST

అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తరచుగా తలనొప్పి రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆకలి  వేయకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా? ఇవన్నీ రక్తంలో హిమోగ్లోబిన్‌ (హెచ్‌బీ) స్థాయులు తగ్గడం వల్లనే వస్తాయి అంటున్నారు నిపుణులు. పెరగాలంటే.. ఇలా చేసి చూడండి.

ఫోలిక్‌ యాసిడ్‌.. రోజువారి ఆహారానికి ఫోలిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉన్న పదార్థాలను జోడించండి. శరీరంలో ఇది లోపించినప్పుడే హిమోగ్లోబిన్‌ శాతం  తగ్గుతుంది. అందుకే ఆకు కూరలు, వేరుశనగ, లివర్‌, మొలకలు, తృణధాన్యాలు, అరటిపండ్లను తినాలి.

ఐరన్‌..  రక్తంలో హిమోగ్లోబిన్‌ తగ్గడానికి ఐరన్‌ లోపం కూడా ప్రధాన కారణం. మాంసం, బచ్చలికూర, బాదం, ఖర్జూరం వంటివి ఐరన్‌ స్థాయుల్ని పెంచుతాయి. హెచ్‌బీ శాతం మరీ తక్కువగా ఉంటే వైద్యున్ని సంప్రదించి ఐరన్‌ సప్లిమెంట్లనూ తీసుకోవచ్చు.

విటమిన్‌ సి.. శరీరంలో విటమిన్‌ సి తగిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా హెచ్‌బీ శాతం తగ్గుతుంది. నారింజ, నిమ్మ, స్ట్రాబెర్రీ, టొమాటో,  ద్రాక్షపండ్లు, బొప్పాయి తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

బీట్‌రూట్‌.. రక్తంలో హెచ్‌బీ శాతం పెంచడంలో ఇది ఎక్కువగా సహాయపడుతుంది. దీనిలో ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, ఫైబర్‌, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడుతున్న వారు దీన్ని రోజూ జ్యూస్‌ చేసుకుని తాగితే మంచిది. సలాడ్‌లా తీసుకున్నా.. ఆరోగ్యమే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని