కాళ్ల నొప్పులా...
మనలో చాలామందికి తరచుగా కాళ్ల నొప్పులు వస్తుంటాయి. అందుకు బలహీనత, అధిక శ్రమ, ఎక్కువసేపు నిలబడి పనులు చేయడం లాంటివి కారణాలని మనకి మనమే సర్దిచెప్పుకొంటాం.
మనలో చాలామందికి తరచుగా కాళ్ల నొప్పులు వస్తుంటాయి. అందుకు బలహీనత, అధిక శ్రమ, ఎక్కువసేపు నిలబడి పనులు చేయడం లాంటివి కారణాలని మనకి మనమే సర్దిచెప్పుకొంటాం. ఎముకలు దృఢంగా లేకపోవడం, కీళ్లు అరగడం కూడా కారణం అయ్యుండొచ్చు. ఈ సమస్యకు గొప్ప పరిష్కారం సంతులాసనం. చాలా తేలికైన ఈ ఆసనాన్ని ప్రయత్నించి చూడండి..
ఇది నిలబడి చేసే ఆసనం. రెండు కాళ్లూ దగ్గరగా పెట్టుకుని తిన్నగా నిలబడాలి. కుడి కాలిని వెనక్కి మడిచి చీలమండను కుడిచేత్తో పట్టుకోవాలి. ఇలా మడిచినప్పుడు రెండు మోకాళ్లూ పక్కపక్కనే ఉండాలి. ఒకటి ముందుకూ, ఒకటి వెనక్కూ ఉండకూడదు. ఎడమచేతిని పైకి చాపి ముందుకు చూడాలి. వెన్ను వద్ద కాస్త కూడా వంగకుండా నిటారుగా నిలబడాలి. ఒక కాలిమీద శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాం కనుక దీన్ని బ్యాలెన్సింగ్ ఆసనం అని కూడా అంటారు. కనీసం 30 సెకన్లు ఈ భంగిమలో ఉండాలి. తర్వాత మెల్లగా యథాస్థితికి వచ్చి, కాస్త సేదతీరి రెండో కాలితోనూ ఈ విధంగానే చేయాలి. ఇలా కాళ్లు మారుస్తూ మూడు నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది.
ఇవీ ప్రయోజనాలు... కాళ్ల నొప్పులు ఉన్నవారికి సంతులాసనం ఎంతో మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల సమస్యలు తగ్గుతాయి. నిగ్రహశక్తి వస్తుంది. శక్తి స్థాయులు పెరిగి చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. నలభై ఏళ్లు దాటిన తర్వాత చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఎముకలు పటుత్వం కోల్పోయి ఎక్కువ దూరం నడవలేరు. అందుకే నడివయసు వాళ్లు ఈ ఆసనం క్రమం తప్పకుండా వేయడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.