అంజీరతో ఆరోగ్యం...

ఒంట్లో నలతగా ఉన్నా, నీరసంగా అనిపించినా త్వరిత శక్తికి అంజీరను తినమని వైద్యులు సలహా ఇస్తారు. ఎండు వాటిని నానబెట్టుకుని తింటే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు పోషకాహార నిపుణులు.

Published : 15 Jul 2023 00:10 IST

ఒంట్లో నలతగా ఉన్నా, నీరసంగా అనిపించినా త్వరిత శక్తికి అంజీరను తినమని వైద్యులు సలహా ఇస్తారు. ఎండు వాటిని నానబెట్టుకుని తింటే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు పోషకాహార నిపుణులు..

బరువు తగ్గడానికి: అంజీరను రాత్రి నానబెట్టుకుని ఉదయం తింటే దానిలోని పీచు నిదానంగా జీర్ణమై కడుపును నిండుగా ఉంచుతుంది. వేరే పదార్థాలు తినాలనే ధ్యాస లేకుండా చేసి బరువును అదుపు చేస్తుంది.

చక్కెర స్థాయులను నియంత్రించి: మధుమేహం ఉన్నవారు నిద్రపోయే ముందు రెండు అంజీరాలను నీటిలో నానబెట్టుకుని పొద్దునే తింటే మంచిది. వీటిలో మేలు చేసే ఒమేగా 3 కొవ్వులు  రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సాయపడతాయి.

ఎముకల కోసం: చాలా మంది మహిళలు క్యాల్షియం లోపంతో బాధపడుతుంటారు. నానబెట్టిన అంజీరను తరచూ తింటే దీనిలోని పొటాషియం, క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి.

గర్భిణులకు: అంజీరాల్లోని విటమిన్‌ బి6, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి బిడ్డ ఎదుగుదలకు సాయపడతాయి. అయితే అంజీరాలను మితంగానే తీసుకోవడం మంచిది.

మెరిసే చర్మానికి: విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని అందించి ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని