చినుకుల వేళ.. వీటిని చేర్చారా
నాలుగు చినుకులు కురిస్తే చాలు.. చుట్టేస్తాయండి.. ఇన్ఫెక్షన్లు! వీటిబారిన పడేది ఎక్కువగా చిన్నారులే. రక్షించడమెలా అని ఆలోచిస్తున్నారా? ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామంతోపాటు ఈ పోషకాలూ అందేలా చూడమంటున్నారు నిపుణులు.
నాలుగు చినుకులు కురిస్తే చాలు.. చుట్టేస్తాయండి.. ఇన్ఫెక్షన్లు! వీటిబారిన పడేది ఎక్కువగా చిన్నారులే. రక్షించడమెలా అని ఆలోచిస్తున్నారా? ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామంతోపాటు ఈ పోషకాలూ అందేలా చూడమంటున్నారు నిపుణులు.
⚛ ఇడ్లీ వంటి పులిసిన ఆహారంతోపాటు పెరుగును తప్పక ఇవ్వండి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ వ్యాధులను దరిచేరనీయవు. క్యారెట్, బీట్‌రూట్, టొమాటో, పాలకూర, గుమ్మడి, సొర వంటివి సూపులుగా చేసిస్తే వేడిగా తాగేస్తారు. శరీరానికీ హాయి.. రోగ నిరోధకశక్తీ పెరుగుతుంది. దీనిలో వాడే పసుపు, అల్లం, వెల్లుల్లిల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు జలుబు, దగ్గు వంటివి రాకుండా చూస్తాయి.
⚛ గుడ్డులో ప్రొటీన్, జింక్, ఎ, బి, డి, ఇ, కె విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, సెలినియం ఉంటాయి. ఇంకా బ్రొకలీ నుంచి బి2, బి6, సి విటమిన్లు, పొటాషియం బీటా కెరొటిన్లు అందుతాయి. ఇవీ ఆరోగ్యాన్ని సంరక్షించేవే.
⚛ నిమ్మతోపాటు పుచ్చ, అరటి, యాపిల్, పియర్, నారింజ, బొప్పాయిల్లో ఏదో ఒక పండును రోజూ తినిపిస్తే సరి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. బీట్‌రూట్ రక్తహీనతను దూరం చేస్తూనే ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినిస్తుంది. వీటన్నింటినీ రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. మొత్తంగా తీసుకునే ఆహారంలో 60-70 శాతం కార్బోహైడ్రేట్లు, 20-25 శాతం కొవ్వు, 10-12 శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకుంటే పిల్లలను ఈ కాలం రోగాల నుంచి రక్షించినట్లే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.