Mobile Phones: ఉదయాన్నే ఫోన్‌ చూస్తున్నారా...

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ కూడా అందరి పనులూ ఫోనులతోనే. అయితే, ఈ వాడకం మితిమీరితే ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఉదయం పూట తమ ఫోన్‌లో నోటిఫికేషన్‌లు, ఈ-మెయిల్‌లు, సోషల్‌ మీడియా అప్‌డేట్‌లలో వచ్చే సందేశాల వల్ల అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

Updated : 19 Sep 2023 07:28 IST

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ కూడా అందరి పనులూ ఫోనులతోనే. అయితే, ఈ వాడకం మితిమీరితే ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.

ఒత్తిడి పెంచవచ్చు: ఉదయం పూట తమ ఫోన్‌లో నోటిఫికేషన్‌లు, ఈ-మెయిల్‌లు, సోషల్‌ మీడియా అప్‌డేట్‌లలో వచ్చే సందేశాల వల్ల అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ మనసులో ప్రతికూలతలు పెరిగి రోజంతా ఆ ప్రభావం కనిపించొచ్చు.  

మానసిక ఆరోగ్యంపై: పొద్దునే లేచింది మొదలు వివిధ సమాచారం కోసం వెతకటం, వాట్సప్‌లో మేసేజ్‌లు ఇలాంటివి శోధిస్తూ ఉంటారు. ఈ ప్రభావం మానసిక స్థితిపైనా ప్రతికూలంగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. కంటి ఆరోగ్యమూ దెబ్బ తింటుంది.

నిద్రలేమి: మంచి ఆరోగ్యానికి చక్కటి నిద్ర అవసరం. రాత్రి పడుకునేటప్పుడు ఫోన్‌ చూస్తే నిద్ర కరవవుతుంది. మొబైల్‌ స్క్రీన్‌ నుంచి వచ్చే బ్లూలైట్‌ మెలటోనిన్‌ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఈ హార్మోన్‌ నిద్ర రావటంలో సహాయపడుతుంది. కాంతి ఎక్కువసేపు కంటిపై పడటం వల్ల నిద్రలేమి సమస్య ఎదురవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని