యూరిన్‌ ఇన్‌ఫెక్షనా...!

కాలం మారింది. వర్షాల వేళ.. అనారోగ్య సమస్యలతో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్లు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువనీటిలో వచ్చే మార్పులు, మంచినీళ్లు సరిగ్గా తీసుకోకపోవడం వంటి వాటితో ఈ సమస్యలెదురవుతాయి.

Published : 18 Jul 2023 00:32 IST

కాలం మారింది. వర్షాల వేళ.. అనారోగ్య సమస్యలతో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్లు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువనీటిలో వచ్చే మార్పులు, మంచినీళ్లు సరిగ్గా తీసుకోకపోవడం వంటి వాటితో ఈ సమస్యలెదురవుతాయి. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, తరచూ మూత్రం రావడం, అలసట, పొత్తికడుపు నొప్పి వంటివి అదనం. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటికి దూరంగా ఉండొచ్చు.

జననాంగాల వద్ద ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఇన్ఫెక్షన్లు దరిచేరవు..

గ్లాసు గోరువెచ్చని నీటిలో స్పూను చొప్పున ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌, తేనె, నిమ్మరసం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రోజూ ధనియాల కషాయం తాగితే మూత్రాశయంలో మంట, నొప్పి నివారణకు చక్కగా ఉపయోగపడుతుంది.

క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవటం వల్ల కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. దీనిలో ఉండే మంచి బ్యాక్టీరియా పొట్టలోకి చేరిన మలినాలను బయటకు పోయేలా చేస్తుంది.

మూత్రాశయంలో నొప్పి, మంట ఉన్న వారు సి విటమిన్‌ ఎక్కువగా ఉండే బొప్పాయి, నారింజ, నిమ్మ పండ్లు తీసుకోవాలి.

అల్లం టీ తాగినా ఈ సమస్యను అధిగమించొచ్చు. రెండు కప్పుల నీళ్లల్లో చిన్న అల్లం ముక్కని కచ్చాపచ్చాగా దంచి కప్పు నీరు అయ్యేంత వరకు మరిగించాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు కాస్త నిమ్మరసం కలిపి తాగితే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని