ఆ నొప్పి దూరమిలా!
నెలసరిలో నొప్పి అందరికీ మామూలే. కొన్నిసార్లు భరించేలా ఉంటే.. మరికొందరికి తట్టుకోలేనంతగా వస్తుంది. మందులపై ఆధారపడక వీటిని ప్రయత్నించమంటున్నారు నిపుణులు.
నెలసరిలో నొప్పి అందరికీ మామూలే. కొన్నిసార్లు భరించేలా ఉంటే.. మరికొందరికి తట్టుకోలేనంతగా వస్తుంది. మందులపై ఆధారపడక వీటిని ప్రయత్నించమంటున్నారు నిపుణులు.
⚛ ఈ సమయంలో ఆహారంపై అనాసక్తి కలుగుతుంది. ఆకలి మందగిస్తుంది. కానీ తినకపోతే నిస్సత్తువతోపాటు నొప్పీ పెరుగుతుంది. కాబట్టి వేళకి తినాలి. తాజాపండ్లు, పప్పుధాన్యాలు, ప్రొటీన్ ఎక్కువుండే ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటివి లభించే ఆహారాన్ని తీసుకోవాలి.
⚛ తీపి పదార్థాలు, జంక్‌ఫుడ్ వైపు మనసు మళ్లుతుంటుంది. ఉప్పునీ తగ్గించాలి. కాఫీ, టీ, ఇతర చక్కెర అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. వీలైనంత ఎక్కువగా నీళ్లను తీసుకుంటే కడుపుబ్బరం వంటివీ తగ్గుతాయి.
⚛ శరీరమంతా కష్టపడేలా వ్యాయామం చేయాల్సిన పనిలేదు. కానీ.. కొద్దిదూరం నడక, యోగా, చిన్న స్ట్రెచింగ్ వంటివి సాయపడతాయి. వ్యాయామాన్ని అలవాటుగా చేసుకున్నా దీర్ఘకాలంలో ఈ నొప్పి నుంచి బయటపడొచ్చు.
⚛ వేడి నీటితో నింపిన వాటర్ బాటిల్ లేదా హీట్ ప్యాక్‌ను దగ్గర ఉంచుకొని పొత్తి కడుపు మీద ఉంచుకోండి. వేడి పొట్ట కండరాలను విశ్రాంతపరిచి నొప్పిని తగ్గిస్తుంది.
⚛ ఈ సమయంలో శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. ఒత్తిడికి దూరంగా ఉంటూనే నిద్ర ఎక్కువగా పోయేలా చూసుకోండి. శరీర అలసటతోపాటు నొప్పీ తగ్గుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.