తడిచిన పాదాలకు రక్షణ

ఈ కాలంలో నీటిలో తడవడం, తడి షూస్‌, సాక్సులు ధరించడం వంటి వాటివల్ల పాదాలకు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. అలా కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుని పాదాలను కాపాడుకోవచ్చు..

Published : 21 Jul 2023 00:01 IST

ఈ కాలంలో నీటిలో తడవడం, తడి షూస్‌, సాక్సులు ధరించడం వంటి వాటివల్ల పాదాలకు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. అలా కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుని పాదాలను కాపాడుకోవచ్చు..

బేకింగ్‌ సోడా: దీనిలో యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఎక్కువ. బకెట్‌లో గోరువెచ్చని నీళ్లు పోసి ఒక స్పూను వంట సోడా, అదే పరిమాణంలో నిమ్మరసం వేసి కలిపి.. పాదాలను ఆ నీటిలో పెట్టాలి. కాసేపటి తర్వాత బయటికి తీసి కాటన్‌ వస్త్రంతో పాదాలు, వేళ్ల సందులను తడి లేకుండా తుడవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పాదాల దుర్వాసన తగ్గుతుంది.

ఎసెన్షియల్‌ ఆయిల్‌: వెడల్పుగా ఉన్న ప్లాస్టిక్‌ టబ్‌ని తీసుకుని పాదాలు మునిగే వరకు గోరువెచ్చని నీటిని పోయాలి. దీనిలో యూకలిఫ్టస్‌, లెమన్‌గ్రాస్‌, పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను ఆరు చుక్కల చొప్పున వేసి పాదాలను పది నిమిషాలపాటు నీటిలో పెట్టాలి. తర్వాత తడి లేకుండా బాగా తుడిస్తే ఇన్‌ఫెక్షన్ల సమస్య ఉండదు.

 వెనిగర్‌: అరబకెట్‌ గోరువెచ్చని నీటిలో అర మూత వెనిగర్‌ వేయాలి. ఆ నీటిలో పాదాలను కాసేపు ఉంచాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఏ సమస్యా ఉండదు.

పాదాల దుర్వాసన సమస్యతో బాధపడే వారు రోజూ సబ్బుతో రెండుసార్లైనా కడుక్కోవాలి. ఉతికిన సాక్సులే వేసుకోవాలి. తడిగా ఉండే సాక్సులు, షూలు వాడకూడదు. పాదాలకు గాలి తగిలే బూట్లు వేసుకుంటే ఇంకా మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని