40 దాటిందా..
మనలో కొందరికి నాలుగు పదులు దాటేసరికి ఇంటా బయటా ఒత్తిళ్లతో ఉత్సాహం తగ్గుతుంది. అలాగే సరైన వ్యాయామం లేక నడుము, తొడల వద్ద కొవ్వు పేరుకుంటుంది.
మనలో కొందరికి నాలుగు పదులు దాటేసరికి ఇంటా బయటా ఒత్తిళ్లతో ఉత్సాహం తగ్గుతుంది. అలాగే సరైన వ్యాయామం లేక నడుము, తొడల వద్ద కొవ్వు పేరుకుంటుంది. అలాంటి ఇబ్బంది రాకూడదంటే పరిగాసనం ప్రయత్నించండి..
యోగా మ్యాట్‌పై రెండు మోకాళ్ల మీద కూర్చోవాలి. తర్వాత ఎడమ కాలును పక్కకు వంచాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ కుడిచేతిని పైకి లేపాలి. ఎడమ చేతిని ఎడమ చీలమండ దగ్గర ఆసరాగా ఉంచి ఎడమ వైపునకు శరీరాన్ని ఎంత వంచగలిగితే అంత వంచాలి. సుమారు 20 క్షణాలు అలాగే వంగి ఉండి, మెల్లగా శ్వాస వదులుతూ తిన్నగా కూర్చోవాలి. ఎడమ వైపునకు వంగడం, తిన్నగా కూర్చోవడం ఇలా ఆరుసార్లు చేయాలి. తర్వాత.. ఇలాగే కుడి కాలును పక్కకు వంచి, కుడి వైపుకు వంగి 20 క్షణాలు ఆ భంగిమలోనే ఉండాలి. ఇటు కూడా ఆరుసార్లు చేయాలి.
ప్రయోజనాలు
సాధారణంగా స్త్రీలకు ఎదురయ్యే అనారోగ్యాలను నివారిస్తుంది కనుక క్రమం తప్పకుండా చేయాలి. దీని వల్ల బద్ధకం వదిలి ఉత్సాహంగా ఉంటుంది. శరీరంలో తగినంత వేడి పుడుతుంది. నడుము, పొత్తి కడుపు, తొడలు బలోపేతం అవుతాయి. శరీరం చక్కగా వంగుతుంది. నడుము, తొడల్లో పేరుకున్న కొవ్వు తగ్గి శరీర ఆకృతిని కాపాడుకున్నట్లవుతుంది. ఉదరభాగం బిగుసుకుపోయినట్టు ఉండదు. ఊపిరితిత్తులకు చాలా మంచిది. శ్వాస సంబంధ, పొత్తికడుపు సమస్యలు ఉత్పన్నం కావు.
ఎవరు చేయకూడదు..
మోకాళ్లకు సర్జరీ అయినవాళ్లు, తీవ్ర మోకాళ్ల నొప్పులతో కూర్చోలేనివాళ్లు తప్ప ఈ ఆసనం అందరూ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.