నిస్సత్తువ పోగొట్టే నేరేడు

వర్షకాలంలో దొరికే అద్భుతమైన ఫలాల్లో నేరేడు ఒకటి. వీటిలో ఉండే పోషకాలు, విటమిన్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి..

Published : 23 Jul 2023 00:16 IST

వర్షకాలంలో దొరికే అద్భుతమైన ఫలాల్లో నేరేడు ఒకటి. వీటిలో ఉండే పోషకాలు, విటమిన్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి..

నేరేడు పండ్లు రక్తంలోని చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తాయి. ఇది మధుమేహ బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఫైబర్‌ ఎక్కువగా కెలోరీలు తక్కువ ఉన్నందున బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది.

ఐరన్‌, సి, బి విటమిన్లు, మెగ్నీషియం మెండుగా ఉండటం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుంది.

ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి.

దీనిలోని విటమిన్‌ బి.. చిగురువాపు, నోటి దుర్వాసన నుంచి దూరం చేస్తుంది.

కడుపులో పేరుకుపోయిన మలినాలను శుభ్రపరచడంలోనూ, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలోనూ ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

కాళ్లు, కీళ్లు, వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

నీరసం, నిస్సత్తువ తగ్గి తక్షణ శక్తి లభిస్తుంది. అంతే కాదు కాలేయ పనితీరు మెరుగుపరచడంలోనూ ఇవి ఎంతగానో దోహద పడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని