పాదాల నొప్పికి..

టెన్నిస్‌ బంతిని నేలపై ఉంచాలి. దాని పై పాదాన్ని ఉంచి.. ఒత్తిడి తీసుకురావాలి. కాలితో ముందుకీ, వెనక్కీ కదపాలి. ఈ వ్యాయామం.. పాదం వంపు దగ్గర ఉండే నొప్పిని తగ్గించడంలో సాయపడుతుంది.

Published : 23 Jul 2023 00:16 IST

టెన్నిస్‌ బాల్‌ రోల్‌:  టెన్నిస్‌ బంతిని నేలపై ఉంచాలి. దాని పై పాదాన్ని ఉంచి.. ఒత్తిడి తీసుకురావాలి. కాలితో ముందుకీ, వెనక్కీ కదపాలి. ఈ వ్యాయామం.. పాదం వంపు దగ్గర ఉండే నొప్పిని తగ్గించడంలో సాయపడుతుంది.

వేళ్లను లాగుతూ: కుర్చీలో కూర్చుని కాలి మీద కాలు వేసుకుని చేత్తో కాలి వేళ్లను మృదువుగా సాగదీయాలి. ఇలా 10 సెకన్లపాటు చేయాలి.

ఇసుకపై నడక: చెప్పులు లేకుండా ఇసుకపై నడవటం వల్ల పాదాలకు మెత్తని స్పర్శ తగులుతుంది. ఇది అరికాళ్లకు మంచి వ్యాయామం.

టవల్‌తో: కుర్చీలో కూర్చొని పాదాలను నేలకు ఆనించాలి. పాదాల కింద కిచెన్‌ టవల్‌ ఉంచి కాలి వేళ్లతో స్ట్రెచ్‌ చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల కండరాలకు చక్కని వ్యాయామం అవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని