ఆహారంలో ‘బి’ ఉందా?

దృఢమైన, మెరిసే కురులు కావాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. మరి అందుకు కావాల్సిన ‘బి’ అందిస్తున్నారా? కొత్త వెంట్రుకలు రావాలన్నా.. ఆరోగ్యంగా పెరగాలన్నా ఈ విటమిన్‌ తప్పనిసరి. అదెందులో దొరుకుతుందంటే... పాలు, పాల పదార్థాల్లో ఎముకలకు బలాన్నిచ్చే క్యాల్షియమే కాదు..

Published : 24 Jul 2023 00:32 IST

దృఢమైన, మెరిసే కురులు కావాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. మరి అందుకు కావాల్సిన ‘బి’ అందిస్తున్నారా? కొత్త వెంట్రుకలు రావాలన్నా.. ఆరోగ్యంగా పెరగాలన్నా ఈ విటమిన్‌ తప్పనిసరి. అదెందులో దొరుకుతుందంటే...

పాలు, పాల పదార్థాల్లో ఎముకలకు బలాన్నిచ్చే క్యాల్షియమే కాదు.. కురులకు ఆరోగ్యాన్నిచ్చే బయోటిన్‌ కూడా దొరుకుతుంది. రోజూ గ్లాసు తీసుకుంటే సరి. గుడ్ల నుంచి బయోటిన్‌ సహా బి విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి.

పాలకూర, పప్పుధాన్యాల నుంచి ఫోలేట్‌ అధికంగా లభిస్తుంది. ఇది రక్తవృద్ధికే కాదు.. కురులు బలంగా ఎదగడానికీ సాయపడుతుంది. బీన్స్‌, బాదం, పొద్దుతిరుగుడు గింజలూ బి విటమిన్‌ పుష్కలంగా దొరికే వనరులే.

బ్రౌన్‌రైస్‌, ఓట్స్‌ నుంచీ బయోటిన్‌ అందుతుంది. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, బి 12 కురులు పెరిగేలా చేయడమే కాదు.. మాడు ఆరోగ్యాన్నీ రక్షిస్తాయి.

వీటితోపాటు నిమ్మ, నారింజ పండ్లనీ తీసుకోండి. మనకు కావాల్సిన ఫోలేట్‌ అందుతుంది. అంతేకాదు.. బి విటమిన్లను శరీరం శోషించుకోవాలన్నా విటమిన్‌ సి తప్పనిసరి. కాబట్టి, వీటికీ రోజువారీ ఆహారంలో చోటివ్వాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని