చినుకు కాలంలో ఆరోగ్య చిక్కులా..

ఈ కాలంలో చర్మ సంబంధ వ్యాధులు తొందరగా వ్యాపిస్తాయి. నిరంతరం తడవడం వల్ల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. ఇంటి చిట్కాలతోనే వీటిని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు.

Published : 25 Jul 2023 00:11 IST

ఈ కాలంలో చర్మ సంబంధ వ్యాధులు తొందరగా వ్యాపిస్తాయి. నిరంతరం తడవడం వల్ల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. ఇంటి చిట్కాలతోనే వీటిని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు.

* ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఉన్న పాంతాన్ని ముందుగా కుంకుడుకాయ రసంతో లేదా గాఢత తక్కువ ఉండే లోషన్‌తో శుభ్రం చేయాలి. ఆ ప్రాంతంలో తడి లేకుండా చూసుకోవాలి.

* యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కనుక గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల వెనిగర్‌ వేసి దూదితో ఇన్‌ఫెక్షన్లు ఉన్న చోట శుభ్రం చేసుకోవాలి.

* కొబ్బరినూనె కూడా వీటిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ నూనెను వేడి చేసి రోజుకు రెండు నుంచి మూడు సార్లు  ఇన్‌ఫెక్షను ఉన్న చోట రాస్తుండాలి.

* వెల్లుల్లిలో యాంటీఫంగల్‌ గుణాలు అంటువ్యాధుల నివారణలో చక్కగా పనిచేస్తాయి. రెండు వెల్లుల్లిరెబ్బలను తీసుకుని చూర్ణం చేసి, అదే పరిమాణంలో ఆలివ్‌ ఆయిల్‌  కలిపి పుండు ఉన్న చోట రాస్తుండాలి.

* వేపాకుని నీటిలో వేసి మరిగించి ఆ నీటితో ఇన్‌ఫెక్షన్‌ ఉన్న ప్రాంతాన్ని కడగాలి. తర్వాత వేపాకుని పేస్టు చేసి పుండుపై పూతలా పెట్టాలి.

* పచ్చి పసుపు కొమ్మును మెత్తని చూర్ణం చేసి రాయాలి. అన్ని వేళలా పచ్చిపసుపు కొమ్ములు దొరక్కపోవచ్చు. ఎండిన వాటిని నీటిలో నానబెట్టి మెత్తని పేస్టు చేసి రాసినా మంచి ఫలితం ఉంటుంది.

వీటితో పాటు కాస్త వ్యాయామం చేయడం వల్ల కూడా రక్త ప్రసరణ బాగా జరిగి చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని