మొదటి మూడు నెలలు.. ఏం తినాలి?

మొదటి మూడు నెలలు గర్భిణులకు పరీక్షే. ఈ సమయంలో వాంతులు, వికారం, నీరసం కారణంగా ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారు.

Published : 26 Jul 2023 00:25 IST

మొదటి మూడు నెలలు గర్భిణులకు పరీక్షే. ఈ సమయంలో వాంతులు, వికారం, నీరసం కారణంగా ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ కడుపులో బిడ్డ ఎదుగుదలకు ఈ మూడు నెలలే ముఖ్యం అంటున్నారు నిపుణులు..

  • ఈ సమయంలో ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌, క్యాల్షియం, ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్‌, ప్రొటీన్లు ఉండే చేపలు, మాంసం వంటి ఆహారం తీసుకోవాలి. ఇవి సమృద్ధిగా అందితే రక్తహీనతను తగ్గించవచ్చు.
  • పెరుగు క్రమం తప్పక తినాలి. దీనిలో క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తల్లి, బిడ్డ ఎముక బలానికీ, కండరాల పెరుగుదలకూ సాయపడుతుంది.
  • ఈ దశలో గర్భిణులు గుడ్డు తినడం చాలా ముఖ్యం. ఇది కడుపులోని శిశువు మెదడు, కళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతేనా.. నెలలు నిండకుండా ప్రసవం జరిగే అవకాశాలూ తగ్గుతాయి.
  • మొదటి మూడు నెలల్లో సి విటమిన్‌ ఉండే బత్తాయిలు, కమలాలు, నారింజలు తినడం మంచిది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పండ్లలోని ఫోలిక్‌ యాసిడ్‌ శిశువు మెదడులో లోపాలు రాకుండా నివారిస్తుంది.    
  • ఆకుకూరల్లో పాలకూర మంచిది. ఇందులో ఐరన్‌, విటమిన్‌ ఎ, కె, పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తకణాల అభివృద్ధికి, కంటి చూపును మెరుగుపరచడంలోనూ, ఎముక ఆరోగ్యానికీ తోడ్పడతాయి.
  • వాల్‌నట్‌లు, బాదం, జీడిపప్పు, పిస్తా వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, మెగ్నీషియం, విటమిన్‌ ఇ మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యానికీ, నరాల పనితీరుకీ, రక్తంలో చక్కెర నియంత్రణకూ సాయపడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని