వెన్నెముక పటుత్వానికి..
మనలో చాలామందికి నడుంనొప్పి సాధారణ సమస్య. ఎక్కువ సమయం కూర్చోలేం. కొన్నిసార్లు పడుకున్నా నొప్పిగానే ఉంటుంది. అర్ధ మత్స్యేంద్రాసనంతో ఈ బాధ నుంచి బయటపడొచ్చు. ప్రయత్నించి చూడండి.. సదుపాయంగా ఉండేలా నిటారుగా కూర్చోవాలి. కుడికాలి పాదాన్ని ఎడమ మోకాలి పక్కన పెట్టాలి.
మనలో చాలామందికి నడుంనొప్పి సాధారణ సమస్య. ఎక్కువ సమయం కూర్చోలేం. కొన్నిసార్లు పడుకున్నా నొప్పిగానే ఉంటుంది. అర్ధ మత్స్యేంద్రాసనంతో ఈ బాధ నుంచి బయటపడొచ్చు. ప్రయత్నించి చూడండి..
సదుపాయంగా ఉండేలా నిటారుగా కూర్చోవాలి. కుడికాలి పాదాన్ని ఎడమ మోకాలి పక్కన పెట్టాలి. ఎడమకాలిని మడిచి కుడి పిరుదు పక్కన ఉంచాలి. ఎడమ చేత్తో కుడి పాదాన్ని పట్టుకోవాలి. కుడిచేతిని నడుము వెనుక లేదా కుడి పిరుదు వద్ద ఆనించి ఉంచాలి. తర్వాత శ్వాస వదులుతూ నడుము, భుజాలను సాధ్యమైనంత వరకూ కుడివైపునకు తిరిగి ఉండేలా చూడాలి. కొన్ని క్షణాలు అలా ఆపి, కళ్లు మూసుకుని ఎక్కడ స్ట్రెచ్ అవుతున్నదో గమనించాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెల్లగా యథాస్థితికి రావాలి. పొట్ట ఉన్నవారు లేదా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వారికి మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా రెండు రోజుల్లో తేలిగ్గా చేయగలుగుతారు. ఇలా ఒక మూడుసార్లు కుడివైపు చేసిన తర్వాత ఇదే విధంగా ఎడమవైపు చేయాలి.
ఇవీ ప్రయోజనాలు... అర్ధ మత్స్యేంద్ర ఆసనం క్లోమ గ్రంథిని (పాంక్రియాస్) ఉత్తేజపరుస్తుంది. అందులో సమస్యలు ఏర్పడితే వాటిని సవరించి సవ్యంగా పనిచేసేలా చేస్తుంది. అడ్రినల్ గ్రంథికి మంచిది. పొట్ట, నడుము దగ్గరున్న అధిక కొవ్వును తగ్గిస్తుంది. వెన్నెముకను మెలితిప్పినట్లు చేయడం వల్ల (స్పైన్ ట్విస్టింగ్) వెన్ను బిగుసుకుపోవడం, పట్టేయడం లాంటి సమస్యలు తగ్గుతాయి. మధుమేహంతో బాధపడేవారికి మరింత లాభదాయకం. ఇన్సులిన్ లేదా టాబ్లెట్లు వాడేవారు దీన్ని రోజూ చేయడం వల్ల సత్వర ఫలితం ఉంటుంది.
ఎవరు చేయకూడదు.. గుండె జబ్బులు, పొత్తికడుపు, మెదడు సమస్యలున్నవారు, తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నవారు ఈ ఆసనం చేయకూడదు. కడుపులో పుండు, హెర్నియా ఉన్నవారు గురువు ఆధ్వర్యంలో చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.