కాళ్లు కదిపేయండిలా..

సంగీతాన్ని, యోగాన్ని ఒక థెరపీలా ఉపయోగించి ఉపశమనం పొందుతున్నవాళ్లు ఉన్నారు. కానీ డాన్స్‌ అనేసరికి... చాలామంది మహిళలు మేమా, డ్యాన్సా అంటూ బిడియపడుతుంటారు.

Published : 30 Jul 2023 00:05 IST

సంగీతాన్ని, యోగాన్ని ఒక థెరపీలా ఉపయోగించి ఉపశమనం పొందుతున్నవాళ్లు ఉన్నారు. కానీ డాన్స్‌ అనేసరికి... చాలామంది మహిళలు మేమా, డ్యాన్సా అంటూ బిడియపడుతుంటారు. కానీ ఒత్తిడిని తగ్గించుకోడానికి నృత్యం కూడా మంచి మార్గం అంటున్నారు నిపుణులు...

  • డాన్స్‌ నాకు రాదు, నావల్ల కాదు అని కాకుండా ఒక్కసారి కాళ్లు కదిపి చూడండి. మీరెంత ఆందోళనలో ఉన్నా ఇట్టే తగ్గిపోతుంది. దీన్ని ఆచరణలో పెట్టడానికి కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు విరామ సమయాల్లో మంచి పాట పెట్టి మాస్‌ డాన్స్‌ చేసేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి.
  • వ్యాయామాలు, శరీరక శ్రమ ఎక్కువగా ఉండే ఆసనాలు చేయడం కంటే ఒక 30 నిమిషాలు నచ్చిన పాట పెట్టుకుని డాన్స్‌ చేస్తే వచ్చే మజా ఇంకెందులోనూ రాదు. బరువు తగ్గాలనుకునే అమ్మాయిలు దీన్నీ ఒక మార్గంగా ఎంచుకోవచ్చు. ఆరోగ్యంగానూ, ఉల్లాసంగానూ ఉంటుంది.
  • ఏదైనా వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కొన్ని భాగాల్లోనే కదలికలు ఉంటాయి. కానీ నృత్యం చేస్తే మెదడు, శరీరభాగాలు సమన్వయంతో పనిచేస్తాయి. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దీన్ని ఆరోగ్య సూత్రంగానూ పాటిస్తే మంచి ఫలితాలు పొందొచ్చు. ప్రయత్నించి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని