వర్షాకాలం వీటికి దూరంగా...
వానాకాలంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు వస్తాయి.. వర్షాకాలంలో కొన్ని కూరగాయలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. బచ్చలికూర, క్యాబేజీ వంటివి తినకపోవడమే మంచిది.
వానాకాలంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు వస్తాయి..
బాగా కడిగి: వర్షాకాలంలో కొన్ని కూరగాయలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. బచ్చలికూర, క్యాబేజీ వంటివి తినకపోవడమే మంచిది. వీటిలో బ్యాక్టీరియా సులభంగా వృద్ధి చెందుతుంది. అందుకే బాగా శుభ్రం చేయాలి. బేకింగ్ సోడాను వేసి ఆకుకూరలు కడగాలి.
నూనె వద్దే వద్దు: ఈ సీజన్‌లో ఎక్కువగా చిరుతిళ్లు తినాలనుకుంటారు. కానీ వేపుళ్లు, రోడ్డు పక్కన వేడివేడిగా దొరికే బజ్జీలు, పునుగులు వంటి వాటిల్లో నూనె ఎక్కువ. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టి అనారోగ్యాలకు హేతువవుతుంది.
చేపలా!: ఈ కాలంలో చేపలూ, పీతలూ, రొయ్యలు వంటి సీఫుడ్స్‌లో బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం ఎక్కువ. అందుకే వీలైనంతవరకూ ఈ సమయంలో వీటికి దూరంగా ఉండటం మంచిది. అలాగే మిగిలిన ఆహారాన్ని మర్నాడు తినడం, పదేపదే వేడి చేసి తినడం వల్ల అది విషతుల్యంగా మారుతుంది. ఎప్పటికప్పుడు తాజాగా వండుకుని తినడానికి ప్రాధాన్యం ఇవ్వండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.