అసలవి శుభ్రమేనా?

పాత్రలు తోమడానికి స్క్రబ్బర్‌లు, స్పాంజ్‌లను ఉపయోగిస్తుంటాం. వీటిని సరిగా శుభ్రం చేయకపోతే నూనె, ఆహార పదార్థాల తాలూకు వ్యర్థాలు వాటినే అంట ¨పెట్టుకొని ఉంటాయి. సూక్ష్మజీవులకు ఆవాసంగా మారతాయి. పైకి గిన్నెలు శుభ్రంగా కనిపించినా అనారోగ్యాలెన్నో తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అలాకాకూడదంటే...

Published : 31 Jul 2023 00:16 IST

పాత్రలు తోమడానికి స్క్రబ్బర్‌లు, స్పాంజ్‌లను ఉపయోగిస్తుంటాం. వీటిని సరిగా శుభ్రం చేయకపోతే నూనె, ఆహార పదార్థాల తాలూకు వ్యర్థాలు వాటినే అంట ¨పెట్టుకొని ఉంటాయి. సూక్ష్మజీవులకు ఆవాసంగా మారతాయి. పైకి గిన్నెలు శుభ్రంగా కనిపించినా అనారోగ్యాలెన్నో తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అలాకాకూడదంటే...

  • ఉప్పునీరు..పాత్రలు కడగడం పూర్తవగానే స్క్రబ్బర్‌ను గోరువెచ్చని నీటితో కడిగి ఎండలో ఆరబెట్టాలి. లేదా ఓ గిన్నెలో పీచుని వేసి అది మునిగేలా వేడినీళ్లు పోయాలి. అందులో రెండు చెంచాల ఉప్పు వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే మంచినీళ్లతో శుభ్రపరిచి వాడుకుంటే సరి.
  • వెనిగర్‌.. రోజూ ఉదయాన్నే పీచుని వాడటానికి ఓ అరగంట ముందు ఇలా చేయండి. ఓ మగ్గు వేడి నీళ్లల్లో పావుకప్పు వైట్‌ వెనిగర్‌ వేసి స్క్రబ్బర్‌ని అందులో నాననివ్వాలి. ఆపై మంచినీళ్లతో కడిగి వాడుకుంటే క్రిములు చేరవు. శుభ్రపడటమే కాదు.. దుర్వాసనా దూరమవుతుంది.
  • అవెన్‌లో.. చిన్నపాత్రలో నీళ్లు, అరచెక్క నిమ్మరసం, ఉప్పు వేసి రెండు నిమిషాలు అవెన్‌లో ఉంచండి. తర్వాత ఆరనిచ్చి మంచినీటితో కడిగినా స్క్రబ్బర్‌ పునర్వినియోగానికి సిద్ధమైపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని