ఇంట్లోనే కసరత్తులు చేసేద్దాం!

వర్షాలు పడుతున్నాయి. ఈ సమయంలో ఆరుబయట నడక, పరుగు వంటివి చేయలేకపోవచ్చు. జిమ్‌కి వెళ్లేవారూ గడపదాటి బయటకు అడుగుపెట్టలేకపోవచ్చు. ఇలాంటప్పుడు ఇంట్లోనే ఉండి చేయగలిగే కసరత్తులివి...

Published : 02 Aug 2023 00:01 IST

వర్షాలు పడుతున్నాయి. ఈ సమయంలో ఆరుబయట నడక, పరుగు వంటివి చేయలేకపోవచ్చు. జిమ్‌కి వెళ్లేవారూ గడపదాటి బయటకు అడుగుపెట్టలేకపోవచ్చు. ఇలాంటప్పుడు ఇంట్లోనే ఉండి చేయగలిగే కసరత్తులివి...

జంపింగ్‌జాక్స్‌/స్కిప్పింగ్‌: చిన్నప్పుడెప్పుడో ఆటల్లో గెంతి ఉంటారు. ఇప్పుడు దాన్నే వ్యాయామంగా చేసుకోండి. లేదా తాడు సాయంతో స్కిప్పింగ్‌ చేయండి. అయితే, శరీరం ఈ కసరత్తులకు అలవాటు పడేవరకూ రెండు మూడు నిమిషాలే చేయాలి. క్రమంగా ఆ సమయాన్ని ఐదు నిమిషాలకు పెంచండి. ఇవి బరువుని త్వరగా అదుపులో ఉంచుతాయి.

మెట్లెక్కండి: ఓస్‌ ఇంతేనా అనుకుంటున్నారా? సులువుగా అనిపించినా... మన శక్తినంతా ఖర్చు చేయగలిగే ఈ కార్డియో ఎక్సర్‌సైజ్‌ కాలి కండరాలను బలంగా ఉంచుతుంది.

బర్పీస్‌: కార్డియో వాస్క్యులర్‌, వెయిట్‌ ట్రెయినింగ్‌ వ్యాయామాల్లో మేలైనది ఇది. గాలిలో దూకుతూ పుష్‌అప్స్‌ చేయడం వల్ల వేగంగా కొవ్వు కరుగుతుంది. హృదయ స్పందన రేటుని పెంచుతుంది. రక్త ప్రసరణను సక్రమంగా సాగేలా చేస్తుంది.

ప్లాంక్స్‌: శరీర బరువుని చేతులూ, కాళ్లతో నియంత్రించే కసరత్తు ఇది. ఆరంభంలో 30 సెకన్ల పాటు ఒకే భంగిమలో ఉండగలిగేలా ప్రయత్నిస్తూ క్రమంగా ఆ సమయాన్ని 120 సెకన్లకు పెంచుకోవాలి. ఈ వర్కవుట్‌ గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్లను దృఢంగా మారుస్తుంది.

స్క్వాట్స్‌: ఈ మిక్స్‌డ్‌ వ్యాయామం కండరాలను బలోపేతం చేస్తుంది. దీనిలో డంబెల్‌ స్క్వాట్స్‌, సుమో స్క్వాట్‌లు వంటి వాటినీ వైవిధ్యంగా ప్రయత్నించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని